పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే పిరియాడిక్ డ్రామా మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా , నిధి అగర్వాల్ ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించి ఇప్పటికే చాలా కాలం అవుతున్న మధ్యలో పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" మూవీ పై ఆసక్తిని చూపించడం , అలాగే క్రిష్ కూడా కొండపొలం అనే మూవీ పై ఆసక్తి చూపించడంతో ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల పాటు నిలిచిపోయింది.

అలా కొంత కాలం పాటు నిలిచిపోయిన ఈ మూవీ షూటింగ్ తిరిగి కొన్ని రోజుల క్రితమే ప్రారంభించారు. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ ను కూడా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ముగించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం హరిహర విరమల్లు మూవీ యూనిటీ ఈ సినిమా ఇంటర్వెల్ యాక్షన్ సన్నివేశాలను చిత్రాకరించింది. ఈ మూవీ ఇంటర్వెల్ యాక్షన్ సన్నివేశాల కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుబురు గడ్డం లుక్ లోకి వచ్చేసాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ఇంటర్వెల్ యాక్షన్ సన్నివేషాలు పూర్తి కావడంతో తిరిగి పవన్ కళ్యాణ్ తన కొత్త లుక్ లోకి వచ్చేసాడు. పవన్ కళ్యాణ్ గడ్డం తీసేసి క్లీన్ షేవ్ లోకి వచ్చేసాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పవన్ కళ్యాణ్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే హరిహర వీరమల్లు మూవీ పై పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: