ఇటీవల కాలంలో చాలామంది సెలవు దినాలలో మాత్రమే సినిమాలు చూడడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు కూడా ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకొని సెలవు దినాలలోనే తమ సినిమాలను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతికి మూడు రోజులు సెలవు దినాలు కావడంతో తెలుగు చిత్రాలే కాదు బాలీవుడ్ , కోలీవుడ్ చిత్రాలు కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే తరువాత వచ్చే పండుగ మహాశివరాత్రి. ఈ పర్వదినాన్ని క్యాష్ చేసుకోవడానికి దర్శక నిర్మాతలు భారీ స్కెచ్ వేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 17వ తేదీన మిగిలిన సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతూ ఉండడం గమనార్హం. జనవరి 11 నుంచి 13 వరకు అజిత్ తెగింపు,  విజయ్ వారసుడు,  చిరంజీవి వాల్తేరు వీరయ్య,  బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ నాలుగు సినిమాలు కూడా రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కినవే కావడం  గమనార్హం. ఈ క్రమంలోని ఈ సినిమాలకు పోటీగా మరే సినిమా రావడం లేదు.  అందుకే మిగిలిన సినిమాలను ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ చేయడానికి చిత్ర బృందాలు సన్నహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 17వ తేదీ థియేటర్లు రద్దీ గా మారనున్నాయి. సమంత గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేసి క్యాష్ చేసుకోవాలని దిల్ రాజు భారీ ప్లాన్ వేశాడు.  ఈ క్రమంలోనే దిల్ రాజు ప్లాన్ ని ఫాలో అవుతూ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న సర్ సినిమా కూడా ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లను కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలతో పాటు ధమ్కి, ఆంటమాన్ 3, మైదాన్ వంటి చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి .ఇప్పటివరకు ఈ సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది ఈ సినిమాలతో పాటు మరెన్ని సినిమాలు పోటీ పడబోతున్నాయో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: