యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితమే వార్ 2 అనే హిందీ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు . మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అ యి న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోవడం లో సక్సెస్ కాలేక పోయింది. ప్రస్తుతం తారక్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ కి డ్రాగన్ అనే టైటిల్ను ఫిక్స్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్న ట్లు , ఆల్మోస్ట్ ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసిన ట్టు , మరికొన్ని రోజుల్లో ఈ టైటిల్ అధికారికం గా ప్రకటించబోతున్న ట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా తారక్ తమిళ దర్శకుడు అయినటువంటి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఓ ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ నాగ వంశీ , తారక్ హీరో గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాను తానే రూపొందించబోతున్నట్లు , ఆ మూవీ షూటింగ్ కొంత కాలంలో ప్రారంభం కాబోతున్నట్లు చెప్పుకొచ్చాడు.

తాజాగా తారక్ , నెల్సన్ దిలీప్ కుమార్ కాంబో మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 2027 వ సంవత్సరం తారక్ మరియు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ , సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా జైలర్ 2 అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: