టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా మెగాస్టార్ కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు నందమూరి హీరో ఎన్టీఆర్ కలిసి నటించిన పాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.ఈ సినిమాతో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లకు ప్రపంచవ్యాప్తంగా మంచి అభిమానం దొరికింది. అంతేకాదు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ మరియు ఆస్కార్ అవార్డులతో సత్తా చాటుకుంది. 

అయితే గత కొంతకాలంగా ఈ సినిమా ఉత్తమ నటుడు కేటగిరీలో ఎన్టీఆర్ పేరు వినిపిస్తుంది.కాగా  మార్చి 12 నెలలు లాస్ ఏంజిల్స్ లో ఈ అవార్డు వేదికగా అట్టహాసంగా జరగబోతోంది. ఈ సినిమాకి సంబంధించి ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న ఒక విషయం ఈరోజు తేలిపోతుంది.అది ఏంటంటే ఈ సినిమాకి ఆస్కార్ వస్తుందా లేదా అన్న విషయం ఈరోజు తేలిపోతుంది. అయితే ఇందులో భాగంగానే ఈ సినిమాలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక మాలీవుడ్ మీడియాతో ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

 గత 30 ఏళ్లుగా మెగా మరియు నందమూరిపైన  రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ తో తనకు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ పైన పోటీ గురించి మరియు మెగా నందమూరి ఫ్యామిలీ నడిచిన 30 ఏళ్లుగా పోటీ ఉంది అని అంతేకాదు నందమూరి తారకరామారావుకు నాన్న చిరంజీవికి మధ్య ఆరోగ్యకరమైన పోటీ అని చెప్పుకొచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని మరొకసారి మరో మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: