మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో ప్రయోగాత్మకంగా చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక అలా ప్రయోగాత్మకంగా చేసిన సినిమాలు అన్నీ కూడా విమర్శల ప్రశంసలు సొంతం చేసుకున్నాయి. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే హై వోల్టేజ్ ఎనర్జీ మాస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలే గుర్తుకొస్తాయి. ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు అన్నీ కూడా ఇదే తరహాలో ఉండి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన కొన్ని సినిమాలు ఈ తరహాలో లేకపోవడంతో యావరేజ్ గా లేదంటే డిజాస్టర్లుగా మిగిలాయి. 

 మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా అంతగా హిట్ అవ్వలేదు. అయితే దానికి కారణం ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి ఆ క్యారెక్టర్ సెట్ కాలేదు. దాని అనంతరం సైరా నరసింహారెడ్డి వంటి సినిమాలలో సైతం చిరంజీవి క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉన్నప్పటికీ ఆ సినిమా కూడా పెద్దగా ఆదరణని పొందలేదు. ఎందుకు అంటే ఆ సినిమాలో మెగాస్టార్ చాలా సీరియస్ గా ఉండడం. ఆ సినిమా మంచి హిట్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ మెగా అభిమానులకి మాత్రం ఆ సినిమా నచ్చలేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో వీరయ్య పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించి

 బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి జూమ్ కాల్ లో ఫ్యాన్స్ తో మాట్లాడారు. ఇక అందులో భాగంగానే ఆ జూమ్ కాల్ లో మెగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా పాల్గొన్నారు. సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్ వంటి సినిమాలు మేము కోరుకోవడం లేదని.. ఇకపై అలాంటి సినిమాలు చేయకండి అని ..తాజాగా చేసిన వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు చేయమని.. అవే మెగా అభిమానులకు ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఇకనుండి అన్ని కమర్షియల్ సినిమాలే చేస్తానని తన అభిమానులకు ప్రామిస్ చేశారు. అంతేకాదు వాల్తేరు వీరయ్య సినిమాకి మించి మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో చేస్తానని చెప్పుకొచ్చారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: