కరోనా సమయంలో ఇండియా లో అన్ని ఇండస్ట్రీలతో పాటుగా సినిమా ఇండస్ట్రీ సైతం ఎంత కుదుపుకు గురయింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో థియేటర్ లు మూతపడడం సినిమా షూటింగ్ లు ఆగిపోవడం వంటి కారణాల వలన సిబ్బంది చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీనితో పరిశ్రమలోకి ఓటిటి చానళ్ళు పుట్టుకువచ్చాయి. దాదాపుగా రెండు సంవత్సరాలు ఓటిటి లలోనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. కేవలం పెద్ద సినిమాలు మాత్రమే థియేటర్ లు ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేసి రిలీజ్ చేసుకున్నారు. థియేటర్ లు ఓపెన్ అయ్యాక కేవలం సౌత్ ఇండియా సినిమాలు మాత్రమే వందల కోట్ల కలెక్షన్ లు సాధించి రికార్డు లు సాధించాయి.

కానీ బాలీవుడ్ మాత్రం ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేక ఫెయిల్యూర్ అయింది. అప్పటి నుండి బాలీవుడ్ పై సౌత్ ఇండస్ట్రీ నుండి విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన బాలీవుడ్ పాన్ ఇండియా సినిమా పఠాన్ మాత్రం అందరి అంచనాలను అందుకుని బాలీవుడ్ ఇన్నాళ్లపాటు పడుతున్న పురిటి నొప్పులను తగ్గించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. షారుఖ్ ఖాన్ నుండి ఒక సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలం అయింది. ఇక షారుఖ్ ఫ్యాన్స్ సైతం పఠాన్ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. సిద్దార్ధ్ ఆనంద్ ఈ సినిమాను ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ గా మలిచి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నాడు.

తాజాగా ఈ సినిమా విజయం గురించి ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన స్టైల్ లో ట్వీట్ పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో ఇండస్ట్రీ పెద్దలు బాలీవుడ్ పై చేసిన విమర్శలను తిప్పికొడుతూ చేసిన ట్వీట్ బాలీవుడ్ కు సంతోషాన్ని ఇస్తుందనే చెప్పాలి. ఈ ట్వీట్ లో ఇంతకు ముందు బాలీవుడ్ పై వచ్చిన విమర్శలను.. ఓటిటిల కన్నా థియేటర్ లలో వచ్చే కలెక్షన్ లు చాలా తక్కువగా ఉంటాయి. షారుఖ్ ఖాన్ పేడ్ అయిపోయిన హీరో, బాలీవుడ్ సౌత్ ఇండియా డైరెక్టర్స్ లాగా ఈ జన్మలో మంచి కమర్సియల్ బ్లాక్ బస్టర్ లు తీయలేరు , అలాగే కెజిఎఫ్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ను దాటడం బాలీవుడ్ సినిమాల వల్ల కాదు అంటూ ఎన్నో విమర్శలు చేశారు. కానీ ఈ రోజు పఠాన్ సినిమా వాటన్నిటినీ బ్రేక్ చేసిందంటూ ఆర్జీవి ట్వీట్ చేయడంతో ఇంకెన్ని వస్తాయో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: