అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఆయన నటవారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగార్జున , నాగచైతన్య మరియు అఖిల్ లు ఆయన పేరును సార్ధకం చేస్తున్నారని చెప్పాలి. నాగార్జున ఇప్పటికే టాలీవుడ్ మన్మథుడిగా పేరు తెచ్చుకుని ఈ వయసులోనూ కుర్రాళ్లకు ధీటుగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక నాగచైతన్య సైతం వరుస హిట్ లను అందుకుని కెరీర్ లో విజయపధంలో ఉన్నా... వ్యక్తిగత జీవితంలో మాత్రం నిరాశతో ఉన్నాడు. ఆ తరువాత మనము చెప్పుకోవలసింది అఖిల్ అక్కినేని గురించి... చిన్నప్పుడే తన నటనతో అందరినీ ఆకట్టుకున్నా పెద్దయ్యాక మాత్రం హీరోగా ఇంకా ఒక సాలిడ్ హిట్ కోసం పడిగాపులు కాస్తూనే ఉన్నాడు.

తాను ఇప్పటి వరకు నటించిన అఖిల్, హలో, మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమాలలో ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమా మినహాయిస్తే మరేదీ అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులకు చేరువ కాలేదు. అందుకే తండ్రి నాగార్జున అఖిల్ కెరీర్ గురించి ఎక్కువ శ్రద్ద తీసుకుని ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఏజెంట్ మూవీ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లి రెండు సంవత్సరాలు అవుతోంది. గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ మరియు ఇతర పనులతో షూటింగ్ తేదీని నిర్ణయించలేదు.

ఏజెంట్ మూవీ ఒక యాక్షన్ పవర్ఫుల్ ఎంటర్టైనర్ గా మన ముందుకు రానుంది. ఇందులో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తుండగా, అఖిల్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా చేస్తోంది.. ఈ సినిమాకు అఖిల్ బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ సీక్వెన్సెస్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయని చిత్ర బృందం ఎంతో నమ్మకంతో ఉంది. ఈ సినిమాను ఒక రేంజ్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. రేస్ గుర్రం మరియు దృవ లాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలను అందించిన దర్శకుడి నుండి రాబోతున్న మరో సినిమా కావడంతో టాలీవుడ్ లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటి వరకు వదిలిన టీజర్ మరియు అఖిల్ పోస్టర్స్ ను చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం కలుగుతోంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో జరుగుతున్న ఆలస్యమే సినిమాకు ప్లస్ గా మారుతుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: