ఫిలిం ఇండస్ట్రీని శాసించే తల్లితండ్రులు తమకు ఉన్నప్పటికీ కొందరు వారసులు నటన పట్ల ఆశక్తి ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో రాణించలేక పోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ నటించిన ‘అహింస’ మూవీ ఎప్పుడో విడుదల కావలసి ఉంది. అయితే ఆమూవీ ఎందుకు విడుదల ఆలస్యం అవుతోందో ఎవరికీ తెలియని పరిస్థితి.సురేష్ బాబు తలుచుకుంటే ఈమూవీ విడుదల ఒక సమస్య కాదు. అయినప్పటికీ సురేష్ బాబు లెక్కలకు ఆసినిమా అందకపోవడంతో ఈమూవీ విడుదల పై క్లారిటీ లేదు అని అంటున్నారు. దీనితో యంగ్ హీరో అభిరామ్ కు ఇలాంటి కష్టాలు ఏమిటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక అల్లు అరవింద్ చిన్నకొడుకు అల్లు శిరీష్ పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. ఆయన తలుచుకుంటే ఒక భారీ మూవీ ప్రాజెక్ట్ తన చిన్నకొడుకుతో సెట్ చేయడం చాల సులువైన పని అయినా శిరీష్ కనీసం సంవత్సరానికి ఒక సినిమా కూడ చేయలేని పరిస్థితులలో ఉన్నాడు అని  .అనిపిస్తుంది. ఇదే కోవలో మంచు మనోజ్ కూడ వస్తాడు.ఆమధ్య ప్రారంభం అయిన అతడి మూవీ ‘అహం బ్రహ్మోస్మీ’ పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియదు. ఇక దిల్ రాజు వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హర్షిత్ రెడ్డి మొదటి సినిమా ఏవరేజ్ గా నడిచినప్పటికీ అతడితో మరో సినిమాను తీసే సాహసం దిల్ రాజ్ చేయలేకపోతున్నాడు. అదేవిధంగా మెగా స్టార్ కూతురు సుస్మిత నిర్మాతగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పటికీ ఆమె భారీ సినిమాలు తీయలేకపోతోంది.
సూపర్ స్టార్ మహేష్ సోదరి మంజుల నటిగా నిర్మాతగా దర్శకురాలిగా ఇలా విబిన్న పాత్రలు పోషిస్తున్నప్పటికీ ఆమె కూడ తన కుటుంబ వారసత్వ స్థాయిలో ఎదగ లేకపోయింది అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. దీనితో వీరందరికీ వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ లభించినప్పటికీ వారి కుటుంబాల స్థాయిలో ఇప్పటికీ వీరు ఎదగ లేకపొతున్నారు అన్న కామెంట్స్ కొందరు చేస్తూ ఉంటారు..


మరింత సమాచారం తెలుసుకోండి: