టాలీవుడ్ అగ్ర హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆరోగ్యం గురించి గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్య ప్రభాస్ తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని.. దాని కారణంగా తన సినిమా షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారని ఫిలిం నగర్ నుంచి వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఇటీవల మొదలవ్వాల్సిన మారుతీ, ప్రభాస్ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. అటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే షూటింగ్ కూడా జరగడం లేదు. అయితే ఇప్పుడు ఏకంగా ప్రభాస్ ఫారిన్ వెళ్ళిపోతున్నారని వార్త అభిమానులను మరింత ఆందోళన కలిగిస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు.ఇటీవల అమెరికా వెళ్ళినట్టు తెలుస్తోంది. 

హెల్త్ చెకప్ కోసం కొన్ని రోజులు తన సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి ప్రభాస్ విదేశాలకు వెళ్లినట్లు టాక్.అయితే ఈ విషయంలో అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇది కేవలం రెగ్యులర్ హెల్ప్ చెకప్ కోసమే అని ప్రభాస్ అనిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మరి కొద్ది రోజులపాటు ప్రభాస్ షూటింగ్లకు వచ్చే అవకాశం లేదని ఇండస్ట్రీ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. తన ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇటీవల ఇండియాలో ఓ హాస్పిటల్ కి వెళ్ళిన ప్రభాస్ కి వైద్యుల సూచన మేరకు షూటింగ్లకు విరామం ఇవ్వాలని చెప్పడంతో ప్రభాస్ నిర్ణయం తీసుకున్నారట.

ఈ క్రమంలోనే ఇప్పటికే కమిట్ అయిన మూవీస్ కు సంబంధించి అన్ని షెడ్యూల్స్ ని క్యాన్సిల్ చేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభాస్ అక్కడే కొద్దిరోజులుగా హెల్త్ చెకప్ చేసుకుంటూ ఆరోగ్యం కుదుట పడినంత వరకు విశ్రాంతి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది  అయితే ప్రభాస్ అనారోగ్యం ప్రాజెక్టుకే విడుదలపై మరింత ప్రభావం చూపి అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల అమితాబచ్చన్ కూడా గాయపడడం కారణంగా మూవీ షెడ్యూల్స్ వాయిదా పడ్డాయి వాళ్ళిద్దరూ కోరుకుంటేనే షూటింగ్ చేస్తారు. అమితాబచ్చన్ మెల్లమెల్లగా కోరుకుంటున్నారు. కానీ ప్రభాస్ విదేశాల నుంచి తిరిగి ఇండియాకి ఎప్పుడు వస్తాడు అనేది క్లారిటీ లేదు. దీంతో అనుకున్న సమయానికి ప్రాజెక్టుకే విడుదల కాకపోవచ్చు అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: