మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా రామబాణం అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ విత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శ్రీ వాస్ దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ డింపుల్ హయాతి ఈ మూవీ లో గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమా బృందం ఈ మూవీ ప్రమోషన్ లను నిర్వహిస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను కూడా విడుదల చేయగా ... వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ మూవీ కి మిక్కి మేయర్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని విశ్వ ప్రసాద్ నిర్మించాడు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా నిర్మాత విశ్వ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా రామబాణం మూవీ నిర్మాత విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ ... రామబాణం మూవీ విషయంలో మరియు ఈ సినిమా కంటెంట్ విషయంలో మేము చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నాం.

మూవీ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో కూడిన పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ కథ మరియు దానిని తెరకెక్కించిన విధానం అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి అని విశ్వ ప్రసాద్ చెప్పుకచ్చాడు. ఇది ఇలా ఉంటే గోపీచంద్ ఆఖరుగా పక్కా కమర్షియల్ మూవీ తో ప్రేక్షకులను నిరాశపరచాడు. మరి రామబాణం మూవీ తో ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తాడో తెలియాలి అంటే మే 5 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఈ మూవీ లో జగపతి బాబు ... కుష్బూ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: