డాన్స్ కొరియో గ్రాఫర్ గా ... నటుడి గా ... దర్శకుడి గా తన కంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో ఒకరు అయినటు వంటి రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లారెన్స్ తన కెరియర్ లో ఎక్కువ శాతం తెలుగు ... తమిళ సినిమాలకు పని చేసి ఈ రెండు ఇండస్ట్రీ లలో కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో లారెన్స్ సినిమాల్లో పాటలకు కొరియో గ్రాఫర్ గా వ్యవహరించడం ... సినిమా లకు దర్శకుడు గా వ్యవహరించడం కంటే కూడా సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నాడు.

అందులో భాగంగా ఈ మధ్య కాలంలో లారెన్స్ ఎక్కువ శాతం సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. తాజాగా లారెన్స్ "రుద్రుడు" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే తమిళ్ మరియు తెలుగు భాషల్లో విడుదల అయింది. తమిళ్ లో ఈ సినిమా రుద్రన్ పేరుతో విడుదల కాగా ... తెలుగు లో రుద్రుడు పేరుతో విడుదల అయింది. పరవాలేదు అనే రేంజ్ అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది.


ఇది ఇలా ఉంటే ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ని మే 14 వ తేదీ నుండి తెలుగు వర్షన్ ను సన్ నెక్స్ట్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి కతరేషన్ దర్శకత్వం వహించగా ... ప్రియ భవాని శంకర్మూవీ లో లారెన్స్ సరసన హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: