కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలను మూడు విడతలుగా ఆరు వేల రూపాయలను జమ చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే మోదీ సర్కార్ అన్నదాతల కోసమే ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు.. ఈ పథకం కింద ఎంతో మంది రైతులు మోడీ ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాన్ని ఇప్పటికే పొందుతున్నారు. అంతే కాదు పి ఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హత ఉన్న చాలా మంది, రైతులు మోడీ అందిస్తున్న డబ్బులను కూడా పొందడం గమనార్హం. ఇక ప్రతి ఏటా మూడు విడతలుగా ప్రతి పండుగ సందర్భంలో డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు..

త్వరలోనే దీపావళి పండుగ కూడా రాబోతోంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరోసారి పీఎం కిసాన్ డబ్బులను రైతుల ఖాతాల్లో వేయడానికి రెడీ అవుతున్నారట.. ఇప్పటికే తొమ్మిది విడుదలను పూర్తిచేసిన ప్రధానమంత్రి ప్రభుత్వం, ఇప్పుడు పదవ విడతను  దీపావళి సందర్భంగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక పదో విడత కింద డిసెంబర్ 15వ తేదీన రైతుల బ్యాంకు ఖాతాల్లో రెండు వేల రూపాయలను జమ చేస్తున్నారు.. ఇక ఈ విషయం తెలుసుకున్న రైతులు పండుగ సందర్భంగా హర్షం వ్యక్తం చేయడం గమనార్హం..

ఇక సాధారణంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం లో చేరిన చాలా మంది రైతులు సంవత్సరానికి ఆరు వేల రూపాయలను తమ ఖాతాలో ప్రభుత్వం నుంచి పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ డబ్బును త్వరలోనే రెట్టింపు చేయడానికి ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ దీపావళి సందర్భంగా ప్రధానమంత్రి వేసే డబ్బులు రైతులకు మరింత ఊరటనిస్తాయి అని చెప్పవచ్చు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను రెట్టింపు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.. కాబట్టి మీ సమీప కేంద్రాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రం లో నుండి అందుకు తగిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: