స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు  పెట్టడం అనేది కొంచెం రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే అయినప్పటికీ కొంచెం ఓపిక ఉంటే కళ్ళు చెదిరే లాభాలను సొంతం చేసుకోవచ్చు అని చెబుతున్నారు స్టాక్ మార్కెట్ నిపుణులు.. సాధారణంగా కొన్ని కంపెనీల షేర్లు ఎప్పుడు లాభాన్ని అందిస్తాయో.. ఎప్పుడు కుప్పకూలిపోతాయో తెలియని పరిస్థితుల్లో అంచనా వేయడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. అయితే కొన్ని కంపెనీల షేర్లు మాత్రం ఇన్వెస్టర్లపై కార్సుల వర్షం కురిపిస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ కంపెనీ షేర్లు మాత్రం ఇప్పుడు ఏకంగా 8 కోట్ల రూపాయలకి పైగా రాబడిని అందించాయి. రత్నమని మెటల్స్ అండ్ ట్యూబ్స్ లిమిటెడ్ కంపెనీ షేర్లు బాగా అదరగొడుతున్నాయని చెప్పవచ్చు.

ఇనుము,  ఉక్కు ఉత్పత్తుల పరిశ్రమకు సంబంధించిన ఈ కంపెనీ షేర్లు మంచి రిటర్నులు కూడా అందిస్తున్నాయి. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా ఈ కంపెనీ షేర్లు 80 వేల శాతానికి పైగా రాబడిని అందించి ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తీసుకొస్తున్నాయి. గతంలో ఈ కంపెనీ యొక్క షేర్ విలువ రూ.2 వుండేది..కానీ ఇప్పుడు దాని విలువ రూ.1700 పైగా దాటేసింది. ఇక ఈ నేపథ్యంలోనే రత్నమని మెటల్స్ అండ్ ట్యూబ్స్ తన పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను కూడా బహుమతిగా అందించింది.. అంతేకాదు పెట్టుబడిదారులకు 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్ లను బహుమతిగా  ఇవ్వడం గమనార్హం.

మీరు లక్ష షేర్లను కొనుగోలు చేసి ఉంటే అందులో  50వేల షేర్లను ఉచితంగా పొందవచ్చు.. ఈ కంపెనీ 2022 మే 18 వ తేదీన ఉన్న షేర్ల బోనస్ ఇష్యూ ను ప్రకటించడం జరిగింది. ఇక ప్రస్తుతం జూన్ 30 2022న..BSE లో రూ.1740.10 స్థాయిలో ట్రేడ్ అవ్వగా ఈ కాలంలో ఈ కంపెనీ షేర్లు 80 వేలకు పైగా రాబడిని అందించాయి. ఉదాహరణకు మీరు గనుక జూలై 11 2003న లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఈ కంపెనీ యొక్క షేర్లు కొనుగోలు చేసి ఉంటే ప్రస్తుతం దీని విలువ రూ. 8 కోట్ల కంటే ఎక్కువగా ఉండేది. కనీసం మీరు వెయ్యి రూపాయలు పెట్టుబడిగా పెట్టినా ఇప్పుడు రూ.8 లక్షలకు చేరుకునేది అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: