ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్రా పథకంలో 6.9% వడ్డీ రేటు అందించబడుతోంది. ఈ పథకంలో కనీసం 1000 రూపాయల నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. దీనికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఎలాంటి గరిష్ట పరిమితి ఉండదు. ఈ పథకం కింద ఎవరైనా పెద్దలు లేదా మైనర్ బాలబాలికుల తరఫున సంరక్షకులు అంటే వారి తల్లిదండ్రులు కూడా ఈ ఖాతా ను తెరవచ్చు. ఇక మైనర్ కు 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఖాతా అతని పేరు మీదకు మారుతుంది. ఇది కాకుండా ముగ్గురు వ్యక్తులు ఏకకాలంలో జాయింట్ ఖాతా కూడా తెరిచే అవకాశం ఉంటుంది. కిసాన్ వికాస్ పత్రా పథకంలో ఖాతా తెరవడానికి ఏ పత్రాలు అవసరమవుతాయి అంటే..
కిసాన్ వికాస్ పత్ర పథకంలో చేరడానికి ఆధార్ కార్డు, రెసిడెన్షియల్ రుజువు , కేవీపీ దరఖాస్తు ఫారం, పాస్పోర్ట్ సైజు ఫోటోతో పాటు సదరు వ్యక్తి మొబైల్ నెంబర్ అలాగే వయసు ధ్రువీకరణ పత్రం అవసరం ఉంటుంది. సమీపంలోని పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి వినియోగదారులు కిసాన్ వికాస్ పత్ర పథకంలో చేరవచ్చు. కెవిపి దరఖాస్తు ఫారం ను నగదు, చెక్, పే ఆర్డర్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. పెట్టిన మీ డబ్బు కచ్చితంగా రెట్టింపు అవుతుంది పైగా సెక్యూరిటీ కూడా లభిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి