సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా సంపాదించిన డబ్బులను భవిష్యత్తు తరాల కోసం దాచుకోవడం తప్పనిసరి.  అలా పెట్టుబడి పెట్టడం.. పొదుపు చేయడం కోసం పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టే పథకాలు ఉపయోగించడం వల్ల సులభంగా డబ్బులను రెట్టింపు చేసుకోవచ్చు.  ముఖ్యంగా ఈ పోస్ట్ ఆఫీస్ పథకాలు పూర్తిగా రిస్క్ లేనివి.. అలాగే మంచి రాబడిని కూడా అందిస్తాయి. మీరు కూడా భవిష్యత్తు తరాల కోసం డబ్బు దాచి పెట్టుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే మీకోసం పోస్ట్ ఆఫీస్ సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రోగ్రాం కింద ప్రస్తుతం అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చిన పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష యోజన పథకాన్ని ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇందులో మీరు ప్రతిరోజు 50 రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టినట్లయితే దాదాపు 35 లక్షల రూపాయల రాబడిని మీరు పొందుతారు. అంటే ప్రతి నెల ఈ పథకంలో 1500 రూపాయలు డిపాజిట్ చేయడం వల్ల 35 లక్షల రూపాయల పెద్ద మొత్తాన్ని మీరు ఒకేసారి పొందవచ్చు. ముఖ్యంగా ఈ పథకంలో చేరడానికి పెట్టుబడిదారుడు 19 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఇందుకోసం వారు కనీసం రూ.10,000 నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.  అనేక ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. నెలవారి, త్రైమాసిక, అర్థవాసిక లేదా వార్షిక ప్రాథమిక వాయిదాలను చెల్లించవచ్చు.

ముఖ్యంగా గ్రామ సురక్ష యోజన పథకం ద్వారా పెట్టుబడి దారుడు 80 సంవత్సరాల వయసులో బోనస్తోపాటు లభించే పెద్ద మొత్తాన్ని పొందుతారు.  అయితే ఈ సమయానికి ముందుగానే పెట్టుబడుదారుడు మరణించినట్లయితే ప్రభుత్వం నుంచి నామినేగా ఉన్న వ్యక్తి ఈ మొత్తాన్ని పొందడానికి వీలుగా ఉంటుంది. అవసరమైతే నాలుగు సంవత్సరాల తర్వాత లోన్ కూడా పొందుతారు లోన్ తీసుకున్నట్లయితే పాలసీ వ్యవధిలో ప్రీమియం చెల్లించడంలో డిఫాల్ట్ అయితే మీరు పెండింగ్లో ఉన్న ప్రీమియం మొత్తాన్ని చెల్లించి మళ్లీ పునః ప్రారంభించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: