ఎవరైనా చిన్న బిజినెస్ మొదలు పెట్టాలనుకునే వారికి అతి తక్కువ బడ్జెట్ తో ఆలోచించి పెట్టాలనుకునే వారికి ఒక బిజినెస్ ఐడియా ఉన్నది.. అదేమిటంటే కారు డీటై లింగ్ బిజినెస్.. సింపుల్ గా చెప్పాలి అంటే కార్ సర్వీసింగ్ సెంటర్ అన్నమాట.. ఇది ఎక్కడైనా సిటీకి అవుట్ సైడ్ పెట్టుకుంటే మరింత బాగా బిజినెస్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రద్దీ ప్రాంతాలలో పెట్టుకోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతారట .అందుకే కాస్త దూరంలో ఇలాంటి కార్ సర్వీసింగ్ సెంటర్లను పెట్టుకోవడం అనేది చాలా మంచిది.


ఎందుకంటే దీనిలో మనం పని రాకపోయినా పరవాలేదు ప్రతిరోజు కొంతమంది లేబర్లను పెట్టుకొని సైతం ఈ బిజినెస్ ని మొదలు పెట్టుకోవచ్చు. కేవలం లక్ష రూపాయలతో ఈ బిజినెస్ను ప్రారంభించి నెలకి రెండు నుంచి మూడు లక్షల వరకు సంపాదించుకోవచ్చు. మనం లక్ష రూపాయలతో కారు సర్వీసింగ్ బిజినెస్ ని సైతం ప్రారంభించవచ్చు. ఈ బిజినెస్ మొదలకు చాలా తక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాము.. కాబట్టి మనం స్టాక్ కోసం ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. కార్ల షోరూమ్ నుంచి డీలర్ షిప్ తీసుకున్న లేకపోతే మెకానిక్ ల నుంచి కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లైతే ఇలాంటి వాటిని చేసుకోవచ్చు.



అయితే ఈ వాటర్ సర్వీసింగ్ బిజినెస్ కోసం కచ్చితంగా నీరు కాస్త ఎక్కువగానే ఉండడమే కాకుండా కాస్త ఓపెన్ ప్లాట్ కూడా అవసరము. అటువంటి ఓపెన్ ప్లాట్లు పలు రకాల ప్రాంతాలలో ఉన్న ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ బిజినెస్ కోసం కావలసిన టూల్స్ లలో జాక్ లు, కారు కీ  సంబంధించిన వాటితోపాటు వైట్ అండ్ డ్రైవ్ వాక్యూమ్ క్లీనర్.. మినీ కంప్రెసర్.. వాటర్ మోటర్ పైపింగ్ సెటప్ ఇతరత్న కొన్ని వస్తువులు పడతాయట. కారు వాషింగ్ డ్రైవింగ్ కెమికల్స్ సాధారణంగా సప్లయర్ కంపెనీ దగ్గర కూడా దొరుకుతాయట. ఈ కార్లు వాషింగ్ చేసినందుకు ఒక్కొక్కరికి 500 నుంచి ₹1000 చొప్పున తీసుకుంటే రోజుకి 10 కార్లు వస్తే దాదాపుగా పదివేల వరకు లభిస్తుంది అలా నెలలో మొత్తం చూసుకుంటే 3 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది.. అయితే కార్లు మాత్రం ఖచ్చితంగా సర్వీసింగ్ సెంటర్ కి వస్తున్నప్పుడే ఇలాంటి ఆదాయం వస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: