గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ బ్యూటీలో తెగ హడావుడి చేస్తున్నారు. అయితే ఒకటీ రెండు చిత్రాలతో తిరిగి బాలీవుడ్ పయణం అయ్యే కొంత మంది హీరోయిన్లకు భిన్నంగా రకూల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డె కొంత మంది హీరోయిన్లు దక్షిణాదిన వరుస ఛాన్స్ లు కొట్టేస్తున్నారు. 2013లో ప్రతీక్ బబ్బర్ హీరోగా నటించిన ‘ఇసాక్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అమైరా దస్తూర్.
ఆ తర్వాత తమిళంలో ధనుశ్ హీరోగా తెరకెక్కిన ‘అనేగన్’ తెలుగులో అనేకుడు మూవీతో సౌత్ ఇండస్ట్రీలో లక్ పరీక్షించుకుంది. ఇండో చైనీస్ చిత్రం 'కుంగ్ ఫూ యోగా'లో జాకీచాన్ సరసన ఆడిపాడింది అమైరా దస్తూర్. ఈ అమ్మడు మూవీలో కన్నా సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది.
తెలుగులో ‘మనుసుకు నచ్చింది’, ‘రాజుగాడు’, సినిమాలో నటించినా అమైరాకు కథానాయికగా సరైన బ్రేక్ లభించలేదు. దీంతో అవకాశాల కోసం మరోసారి హాట్ ఫోటో షూట్స్నే నమ్ముకుంది. ఫుల్ స్కిన్ షోతో అదరగొట్టేసింది అమైరా. తాజాగా ఈమె పోస్టు చేసిన ఒక ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మరి వీటి ప్రభావంతో మరిన్ని అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటుందేమో చూడాలి.