ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. సాధారణంగా మహేష్ సినిమాలకు సంబంధించిన టీజర్ లను లేదంటే ఫస్ట్ లుక్ పోస్టర్లను ఈరోజు విడుదల చేయడం ఒక సాంప్రదాయం. అదే పద్ధతిని కొనసాగిస్తూ కృష్ణ చేత మహేష్ అనీల్ రావిపూడిల మూవీ టైటిల్ ప్రకటనకు కు సంబంధించిన వీడియో బైట్ ను విడుదల చేసారు. 

ఇప్పటికే ప్రచారంలో ఉన్న ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ ను అధికారికంగా నిన్న రాత్రి ప్రకటించారు. ఈసినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు ఈరోజు ఉదయం 8.19 నిముషాలకు అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభం కాబోతున్నాయి.

వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లుగా ఈమూవీ టైటిల్ పోస్టర్ లో ప్రకటించారు. ఈమూవీ టైటిల్ డిజైన్ పరిశీలిస్తే ఈమూవీ కథ ఇండియన్ ఆర్మీ చుట్టూ తిరుగుతుందని అర్ధం అవుతుంది. ఈమూవీ టైటిల్ పోస్టర్ లో AK 47  గన్ పై ఒక సైనికుడి క్యాప్ కనిపిస్తున్న నేపధ్యంలో ఈమూవీ కథకు సంబంధించిన రేఖా మాత్రమైన లీకులు ఇస్తున్నారు. 

ఇప్పటి వరకు ఈసినిమాలో మహేష్ పోలీస్ గా కనిపిస్తాడని ప్రచారం జరిగింది. అయితే వాస్తవానికి మహేష్ ఈమూవీలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు అన్న సంకేతాలు ఈ పోస్టర్ ద్వారా ఇచ్చాడు. ‘మహర్షి’ అందుకోలేని కలక్షన్స్ రికార్డులను అందుకోవడానికి ఒకనాటి ఎన్టీఆర్ జానపద ‘కంచుకోట’ సినిమా పాటలోని పల్లవిని ఆధారంగా చేసుకుని మహేష్ మూడు అక్షరాల టైటిల్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి రాబోతున్న ఈ ‘సరిలేరు నీకెవ్వరు’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: