తెలుగు బుల్లితెర‌ను ఓ ఊపు ఊపేసిన బిగ్ బాస్ తొలి రెండు సీజ‌న్ల‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. తొలి సీజ‌న్‌కు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉన్నారు. ఇక రెండో సీజ‌న్‌కు నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్‌గా ఉన్నారు. ఈ రెండు సీజ‌న్లు హిట్ అవ్వ‌డం వెన‌క కంటెస్టెంట్ల పాత్ర‌తో పాటు ఎన్టీఆర్, నాని పాత్ర కూడా ఉంది. ఇక ఇప్పుడు మూడో సీజ‌న్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి.


అంచ‌నాలు అందుకునే క్ర‌మంలోనే మూడో సీజ‌న్‌కు స‌రైన హోస్ట్ కోసం నిర్వాహ‌కులు చాలా రోజులు వెయిట్ చేసి మ‌రీ నాగార్జున‌ను ఒప్పించారు. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రోగ్రామ్‌ను నాగార్జున ఒంటి చేత్తో స‌క్సెస్ చేశాడు. ఆ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి ఈ షోకు హోస్ట్‌గా ఉన్నా నాగార్జున‌తో పోలిస్తే అనుకున్న రేంజ్‌లో స‌క్సెస్ కాలేదు.


ఈ క్ర‌మంలోనే నాగ్‌ను బిగ్ బాస్ హోస్ట్‌గా తీసుకువ‌చ్చారు.  ఈ సీజ‌న్‌లో మొత్తం 100 ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది. నాగార్జునకు ఈ సీజ‌న్ మొత్తానికి భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 12 లక్షల రూపాయలు నాగ్‌కు ముట్ట‌నున్నాయ‌ట‌. మొత్తంగా నాగ్‌కు రూ.12 కోట్ల రెమ్యున‌రేష‌న్ అంద‌నుంది. ఈ సీజ‌న్‌లో హౌస్‌లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: