బుల్లితెరపై సూపర్ హిట్ షోగా పేరు తెచ్చుకుంది జబర్దస్త్. ఈ షోకు యావత్ తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. షో స్టార్టింగ్ కంటే ఇప్పడూ బాగా పాపులర్ అయ్యింది. కొత్త కొత్త వాళ్ళు ఎందరో వాళ్ళ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు.
ఇలా తన టాలెంట్ తో అదరగొడుతున్న వాళ్లలో ఆది ఒకరు. ఆది జబర్దస్త్ కు ఎలా వచ్చాడు అనే దానిపై ఆయన చెప్పిన వివరాలు అందరికి ఆకట్టుకుంటున్నాయి. జాబ్ అంటే బోర్ కొట్టి ఏదైనా కొత్తగా చేయాలని అనుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది క్లైమాక్స్ స్పూప్ చేశారట.
ఈ స్పూఫ్ యూట్యూబ్ లో పెడితె మంచి వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన అదిరే అభి బాగా చేశావు ఒకసారి రమ్మని చెప్తే వెళ్ళాడట. అలా వెళ్లిన ఆది .. అభితో కలిసి ఫోటో దిగాడు. దానికి మంచి లైకులు వచ్చాయట.
కేవలం ఫోటో దిగితేనే అన్ని లైక్ లు వస్తే.. జబర్దస్త్ చేస్తే ఇంకెంత పాపులారిటీ వస్తుందో అనుకోని జబర్దస్త్ లో కంటిన్యూ అయ్యినట్టు చెప్పుకొచ్చాడు ఆది. జాబ్ చేసే రోజుల్లో పక్కన ఉన్న వ్యక్తులను నవ్వించే వాడినని.. ఇప్పుడు జబర్దస్త్ స్కిట్ ద్వారా ప్రపంచాన్ని నవ్విస్తున్నానని అంటున్నాడు ఆది.