అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న చందంగా ఉంది ప్రభాస్ సాహో ప‌రిస్థితి. అస‌లు సాహో మేక‌ర్స్ సాహో ఎందుకు ఇంత బ‌డ్జెట్‌తో తీశారు ?  దీని ద్వారా వాళ్లు ఏం చెప్పాల‌నుకున్నారో ?  వాళ్ల‌కే అర్థం కాని ప‌రిస్థితి. సాహో మొదట్లో రూ.50 కోట్లతో తీయాలనుకున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకుండానే బాహుబ‌లి 1, ఆ త‌ర్వాత 2 వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యాయి. అంతే ప్ర‌భాస్ ఇండియా హీరో అయిపోయాడు. ప్ర‌భాస్ మార్కెట్ పెరిగిపోయింద‌ని ప్ర‌భాస్‌ను ప‌క్క‌నే ఉన్న వాళ్లు బాగా ఉబ్బేయ‌డం మొద‌లు పెట్టేశారు.


ప్ర‌భాస్ అయినా బాహుబ‌లిలాగ‌నే అన్ని సినిమాలు ఉంటాయ‌ని ఎందుకు ?  ఎలా ?  ఊహించుకున్నాడో తెలియ‌ని ప‌రిస్థితి. ఇంతే అద‌నుగా మ‌ళ్లీ మ‌రో బాహుబ‌లి మ‌న‌కు కావాల‌నుకున్నాడు. సాహోకు ఓకే చెప్పేశాడు. అస‌లు సుజిత్ స్కేల్ ఏంటి ?  సుజిత్ రేంజ్ ఏంటి ?  రాజ‌మౌళికి సుజిత్‌కు పోలికా.. సుజిత్ అనుభ‌వం ఎంత‌?  షార్ట్ ఫిల్మ్‌లు తీసుకుని ఒక్క హిట్ ఇస్తే అంత గుడ్డిగా న‌మ్మేస్తాడా ?   సుజిత్ మీద రూ.350 కోట్లు పెట్టేంత గుడ్డి న‌మ్మ‌కం ప్ర‌భాస్‌కు, ఆయ‌న స‌న్నిహితులైన ఈ సినిమా నిర్మాత‌ల‌కు ఎందుకో ?  ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌డం లేదు.


పోని అంత బ‌డ్జెట్ పెర‌గ‌డం వ‌ల్ల సినిమాకు యూజ్ ఉందా ?  అంటే అదీ లేదు. ఓ యాక్ష‌న్ స‌న్నివేశం కోసం ఏకంగా అబుదాబీ వ‌ర‌కు వెళ్లారు. ఒక సిటీ కోసం ఏకంగా సిటీ సెట్ వేసేశారు. ఒక సంగీత దర్శకుడికి కోటో రెండు కోట్లో ఇచ్చి పాటలు నేపథ్య సంగీతం చేయించుకోవడానికి బదులు ఒకరితో బ్యాగ్రౌండ్ స్కోర్.. ఐదారుగురితో పాటలు చేయించుకుని పది కోట్ల దాకా వదిలించుకున్నట్లున్నారు. రెండు మూడు సీన్లు చేయాల్సిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కోసం ఏకంగా ఎవ్లీన్ శ‌ర్మ‌ను తీసుకున్నారు.


తెర‌మీద డ‌బ్బులు కుమ్మ‌రించి... అంత పెట్టాం.. ఇంత పెట్టాం అన్న‌ది మార్కెట్ మాయ‌ల వ‌ర‌కే గాని అంతిమంగా థియేట‌ర్ల‌ను ప్రేక్ష‌కుల‌కు ర‌ప్పించేది క‌థ‌, క‌థ‌నాలే అన్న‌ది సాహో మేక‌ర్స్ పూర్తిగా మ‌ర‌చిపోయారు. ఎన్ని తళుకులున్నప్పటికీ ఏ సినిమాకైనా కావాల్సింది.. సరైన కథ దాన్ని బిగితో చెప్పే కథనం. ఆ రెండు విషయాల్లో మాత్రం ‘సాహో’ ఘోరంగా విఫలమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: