హైపర్ ఆది.. పెద్దగా పరిచయం అవసరం లేని కమెడియన్. బుల్లి తెర ద్వారా విపరీతమైన పాపులారటీ తెచ్చుకున్న నటుడు. హైపర్ ఆది ది ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి దగ్గర పల్లామల్లి గ్రామం. అమ్మ సుబ్బమ్మ, గృహిణి. నాన్న నరసింహారావు రైతు. ముగ్గురం అన్నదమ్ములం. హైపర్ ఆది చిన్నోడు. ఏమీలేని స్థితిని చూసినవాడు. కాబట్టి జీవితంపై కసి పెరిగింది. ఆయన పేరుకు ముందు అప్పటి జబర్దస్త్‌ దర్శకులు భరత్‌, నితిన్‌ ‘హైపర్‌’ అని తగిలించారు.

 

హైపర్ ఆది కందుకూరులోని ప్రకాశం బీటెక్‌ కాలేజీలో చదివాడు. చివరి బెంచీలో కూర్చుని డైలాగ్స్‌ వేసేవాడు. ‘అతడు’ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర ఫస్ట్రేటెడ్‌గా ఉంటుంది. నచ్చి అలాంటి పాత్రలే రాసుకున్నాడు. అవే పేరు తెచ్చాయి. బీటెక్ పూర్తయ్యాక హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. కానీ మనసంతా సినీరంగం వైపే ఉండేది.

 

బీటెక్‌ చదివేటప్పుడు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ప్రసంగం, అత్తారింటికి దారేది సినిమాలోని ఓ సీన్‌కి స్పూఫ్‌ చేశాడు. ఆ వీడియోలను లక్షలమంది చూశారు. ఆ వీడియోని ‘అదిరే అభి’ అన్న చూసి ఆ వీడియోకిందనే మెసేజ్‌ పెట్టారు. మెసేజ్‌ చూశాక ఫోన్‌ నంబరు తీసుకుని అన్నపూర్ణ స్టూడియోకెళ్లి కలిశాడు. అలా జబర్దస్త్ కు వచ్చి బాగా క్లిక్ అయ్యాడు.

 

 

తాను డైలాగులు రాయాలని ఇక్కడికి రాలేదు. రాయాల్సి వచ్చింది. సినిమాల ప్రభావం, గ్రామీణ నేపథ్యం, జనాలతో కలవటం వల్లనే వ్యంగ్యం ఎలా రాయాలో తెల్సింది. నా కెరీర్‌కు రచన, సహజమైన హావభావాలు, టైమింగ్‌ బలాలయ్యాయి అంటున్నాడు హైపర్ ఆది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: