మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మొదట రేయ్ సినిమాలో నటించినా పిల్లా నువ్వులేని జీవితం మొదట విడుదలైంది. తొలి సినిమాతోనే హిట్ కొట్టిన సాయిధరమ్ తేజ్ రేయ్ ఫ్లాప్ అయినా సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమా హిట్లతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తిక్క సినిమాతో ఫ్లాపుల బాట పట్టిన సాయి ధరమ్ తేజ్ ఆరు ఫ్లాపుల తరువాత ఈ సంవత్సరం కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రలహరి సినిమాతో హిట్ కొట్టాడు.
డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపుల తరువాత సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి తేజ్ ఫ్లాపుల పరంపరకు బ్రేకులు వేసింది. విజయ్ కృష్ణ పాత్రలో సాయి ధరమ్ తేజ్ అద్భుతంగా నటించాడు. చిత్రలహరి తరువాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ప్రతిరోజు పండగే సినిమా రేపు విడుదల కాబోతుంది. సాయి ధరమ్ తేజ్ కు జోడీగా రాశీఖన్నా నటిస్తున్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకొని చిత్రలహరి ఊపును కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి. మరోవైపు డైరెక్టర్ మారుతి కూడా ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. మారుతి దర్శకత్వం వహించిన మహానభావుడు హిట్టైనా శైలజారెడ్డి అల్లుడు ఫ్లాప్ కావడంతో ఎలాగైనా సక్సెస్ సాధించాలనే కసితో ఈ సినిమా తెరకెక్కించాడు.
సత్యరాజ్, రావు రమేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయి. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు ఇప్పటికే విడుదలై శ్రోతల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. రేపు విడుదలైన తరువాత ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి