న్యూయర్, సంక్రాంతి, దసర, దీపావళి ఏ పండగ వచ్చినా సరే సినిమా ప్రియులకు కావల్సింది కొత్త సినిమాలే. ఇలా ప్రతి ఫెస్టివల్ కి కావల్సింది ఎంటర్టైన్మెంట్. ఇక ఈ సంవత్సరం తెలుగు చిత్రసీమ నుంచి దాదాపు 12 సినిమాలు జనవరిలో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి. జనవరి 1 నుంచే సినిమా సందడి మొదలవనుంది. జనవరి చివరి వరకు 12 చిత్రాలు తెలుగు ప్రేక్షకులను సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
కొత్త ఏడాదికి, సంక్రాంతికి సందడి చేయడానికి ఈ సారి చాలానే సినిమాలు ఉన్నాయి. తెలుగు చిత్రసీమ నుంచి దాదాపు 12 సినిమాలు జనవరిలో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి. జనవరి 1 నుంచే సినిమా సందడి మొదలవనుంది. జనవరి ఆఖరి వారం వరకు 12 చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అన్ని సినిమాలు దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.
కొత్త ఏడాది మొదటి వారంలో నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 'బ్యూటిఫుల్', 'అతడే శ్రీమన్నారాయణ', 'తూటా',' హల్ చల్' సినిమాలు తెలుగు ఆడియన్స్ ను అలరించేందుకు దూసుకొస్తున్నాయి. నైనా గంగూలీ హీరోయిన్ గా నటిస్తున్న బ్యూటిఫుల్ సినిమాకు అగస్త్య మంజు దర్శకత్వం వహించగా .. రామ్ గోపాల్ వర్మ దీన్ని రూపొందించారు. ఈ సినిమాకి కాస్త క్రేజ్ ఎక్కువగానే ఉంది. కొత్త ఏడాది తొలి రోజునే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ హీరో రక్షిత్ శెట్టి టైటిల్ రోల్ పోషిస్తున్న అతడే శ్రీమన్నారాయణ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రెయిలర్ ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో యాక్షన్ ఓరియంటెడ్ పార్ట్ చాలా బావుంది.
కోలీవుడ్ నటుడు ధనుష్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'తూటా' కూడా జనవరి 1నే రిలీజ్ కానుంది. రోమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. మేఘా ఆకాశ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ముచ్చటగా మూడో చిత్రం 'హల్ చల్' జనవరి 3న హల్ చల్ చేసేందుకు రెడీ అయింది. రుద్రాక్ష్, ధన్యబాలకృష్ణన్ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలె ఇడుదలైన ధన్యబాలకృష్ణ, రాజ్‌తరుణ్ నటించిన చిత్రం విడుదలయింది. సినిమా ఆశించినంత హిట్ కాలేకపోయినా ధన్యబాలకృష్ణకు మంచి మార్కులే పడ్డాయి.