అనుష్కకి టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కానీ సైజ్ జీరో తర్వాత ఒక్కసారిగా లావు పెరగడం తో స్టార్ హీరోయిన్ గా ఉన్న అనుష్క కాస్త అవకాశాలు తగ్గిపోయాయి. అయినప్పటికీ ఈ అమ్మడు ఎక్కడ నిరాశ చెందకుండా విభిన్నమైన కథలతో ముందుకు వస్తూనే ఉంది. బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత భాగమతి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెర మీదికి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది అనుష్క. ఈ సినిమాలో అనుష్క నటనకు గానూ విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఇక ప్రస్తుతం నిశ్శబ్దం అనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది అనుష్క. 

 

 

 సరికొత్త సస్పెన్స్ త్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా మొత్తం పూర్తిగా ట్విస్ట్ లతో సాగుతుందని  ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో అర్థం అయింది. ఇక తాజాగా నిశ్శబ్దం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక ఈ సినిమాకు అనుష్క ఇప్పటివరకూ చేసిన దర్శకులందరూ అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిశ్శబ్దం సినిమా ట్రైలర్ చూశానని ఎంతో  ఆకట్టుకునేలా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా స్వీటీకి తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని గురించి కూడా చెప్పుకొచ్చాడు రాజమౌళి. 

 

 

 అనుష్క తనకు ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. అయితే తాను అనుష్క ను ఎంతగానో గౌరవిస్తానని... ఎప్పుడూ పొలైట్ గా ఆలోచిస్తూ ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అనే  విధంగా  అనుష్క ఎంతో గొప్పగా ఉంటుంది అంటూ రాజమౌళి తెలిపారు. ఒక నటిగా అనుష్క పాత్రలో తన 100% ఎఫర్ట్  పెట్టినట్లే.. ఒక హ్యూమన్ బీయింగ్ గా  కూడా మంచి వ్యక్తి అంటూ చెప్పుకొచ్చాడు. అనుష్క ను అమితంగా గౌరవించడానికి కారణం తాను ఒక మంచి నటి మాత్రమే కాకుండా ఒక మంచి మనిషి అంటూ రాజమౌళి తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: