పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కంపల్సరీ. అదిరిపోయే ఇంట్రడక్షన్ ఫైట్ లు, ఎంట్రీ సాంగ్స్, విజిల్ బ్లోయింగ్ మూమెంట్స్.. ఇలా మొత్తం ఒక ప్యాకేజీలా ఉంటుంది. కానీ పవన్ ఇప్పుడీ ప్యాకేజీని పక్కనపెడుతున్నాడట. పొలిటికల్ ఎజెండాకు ప్లస్ అయ్యే కథలకే ఓకే చెబుతున్నాడు పవన్. 

 

పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో చాలా చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు అన్నట్టుగా షూటింగ్ లకు వెళ్లే పవన్, రీఎంట్రీలో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కు సైన్ చేశాడు. మూడు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. మరోవైపు డాలీ లాంటి వాళ్లు పవన్ కోసం కథలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే పవన్ లో వేగంతో పాటు, స్టోరీ సెలక్షన్ లోనూ మార్పు కనిపిస్తోంది అంటున్నారు జనాలు. 

 

పవన కళ్యాణ్ ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కుతోంది సినిమా. అన్యాయంగా కేసులో ఇరుక్కున్న ముగ్గురు అమ్మాయిలకు న్యాయ సహాయం అందించే లాయర్ కథాంశంతో వచ్చింది పింక్. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కమర్షియల్ హీరోయిజానికి పెద్దగా ప్రాధాన్యత లేదు. 

 

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోంది. కోహినూర్ డైమండ్ నేపథ్యంలో వస్తోన్న ఈ కథలో పవన్ రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. బ్రిటీష్ పాలకులు దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకే పంచే విప్లవకారుడిగా నటిస్తున్నాడు. 

 

పవన్ కళ్యాణ్ నటిస్తోన్న రెండు సినిమాలు కమర్షియల్ మాస్ మసాలా ఫార్ములాకు భిన్నంగా వస్తున్నాయి. దీంతో జనసేనాని రెగ్యులర్ హీరోయిజానికి బ్రేకులేసి, తన ఇమేజ్ కు సెట్ అయ్యే స్టోరీస్ ని సెలక్ట్ చేసుకుంటున్నాడనే టాక్ ఎక్కువైంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కు ప్లస్ అయ్యే కథల్లోనే నటిస్తున్నాడని, ఇలాంటి స్టోరీస్ తీసుకొచ్చే దర్శకులకు పవన్ ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. మరి మున్ముందు పవన్ ఎలాంటి కథలతో వస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: