మెగాస్టార్ చిరంజీవి కి ఎంత మంది హీరోలు ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కేవలం ప్రేక్షకులకు మెగాస్టార్ గా మాత్రమే కాకుండా టాలీవుడ్ పెద్దగా... తెలుగు చిత్ర పరిశ్రమని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత గల వ్యక్తిగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. ప్రతి విషయంలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.... టాలీవుడ్ లో ఎవరికి సహాయం కావాలన్నా చేయూతనిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం కరోనా  వైరస్ కష్టకాలంలో టాలీవుడ్ ప్రముఖులు అందరిని ఒక తాటిపైకి తెచ్చి సినీ కార్మికులకు చేయూతనిచ్చేందుకు ముందుకు సాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం సినీ కార్మికులు అందరూ సినిమా షూటింగులు  నిలిపి వేయడంతో ఉపాధి కరువై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

 


 ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో... కరోనా  వైరస్ ప్రభావం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు నిత్యావసరాలు అందించడం కోసం సి సి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మెగాస్టార్ చిరంజీవి. సిసిసి అనే కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు అందరు నుంచి విరాళాలు సేకరించి... సినీ కార్మికులు అందరికీ నిత్యావసరాలు అందిస్తూ చేయూతనిస్తున్నారు. అంతే కాకుండా టాలీవుడ్ ప్రముఖులు అందరూ ముందుకు వచ్చి సినీ  కార్మికులందరినీ ఆదుకోవాలని పిలుపునిస్తున్నారు. అదే సమయంలో టాలీవుడ్ సినిమా చిత్రీకరణకు సంబంధించి కూడా చర్చలు జరుపుతున్నారు.

 


 అన్నీ తానై తెలుగు చిత్ర పరిశ్రమను తీసుకెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సినిమా షూటింగులు ప్రారంభించాలని కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెబుతూ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి అన్ని బాధ్యతలను తన భుజాలపై వేసుకొని నడిపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. కేవలం ప్రేక్షకులకు మాత్రమే కాదు... తెలుగు సినీ పరిశ్రమకు మొత్తం అన్నయ్య గా మారి బాధ్యత తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇలా టాలీవుడ్ ని విజయవంతంగా ముందుకు నడిపిస్తూ అందరినీ సమన్వయం చేస్తూ... కీలక చర్చలు జరుపుతూ పెద్ద బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: