రీసెంట్ గా బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పి సినిమాలతో లైఫ్ కంటిన్యూ చేయడానికి నిర్ణయించుకున్న ఈ బ్యూటీకి మరోసారి నిరాశ తప్పడం లేదట... ఇది ఎవరో చెప్పడం కాదు ఆమె పోస్ట్ చేస్తున్న ఆమె తాజా చిత్రాలే చెబుతున్నాయి.శ్రుతి షేర్ చేసిన తాజా ఫోటో చూస్తుంటే 'ఏదో తెలీని గజిబిజి జీవితం' కనిపిస్తోంది. మళ్లీ తనేదో డిప్రెషన్లోకి వెళ్లినట్టు ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది. ఇటీవల శ్రుతి ఏం చేస్తున్నా అందులో ఏదో ఫ్రస్టేషనే కనిపిస్తోంది తప్ప ప్రశాంతత కనిపించడం లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంచితే మరోపక్క ఆమె సినీ జీవితం... అనుకున్నది ఒకటైతే ఆమె చేతికందింది మరొకటి అన్నట్టు మారింది పరిస్థితి.... గబ్బర్ సింగ్ రేంజ్ లో కాక పోయినా ఎలా అయినా ఓ హిట్ అందుకోవాలన్న ఆకాంక్షతో క్రాక్ సినిమాకు రవితేజతో జతకట్టారు శృతిహాసన్. అయితే ఈ సినిమాను ఓటీటీ వేదికపై విడుదల చేస్తారా లేదా అన్న విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు.... మరోవైపు ఈ సినిమా థియేటర్ లోనే విడుదల కావాలని శృతి ఆకాంక్షిస్తున్నట్లు తెలుస్తోంది... మరి శృతిహాసన్ క్రాక్ రిలీజ్ ఎటువైపో ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. మరి ఈ సినిమాతో శృతి హిట్ ట్రాక్ ఎక్కుతుందా?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి