తెలుగు సినిమాల్లో ప్రస్తుతం స్టార్ హీరోలందరూ సినిమాలతో బిజీ. ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్, మహేశ్, అల్లు అర్జున్ ఒక హిట్ ఇచ్చిన క్రేజ్ తో, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆల్ ఇండియా అటెన్షన్ చేస్తూ ఎవరికి వారు సినిమాలతో బిజీగా ఉన్నారు. వీరందరికి అతీతంగా పవన్ కల్యాణ్ మాత్రం అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో బిజీగా ఉన్నారు. పైగా.. ఆయన నుంచి సినిమా వచ్చి మూడేళ్లవుతోంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలందరికీ భిన్నంగా పవన్ సినిమాపై క్రేజ్ నెలకొంది. పైగా.. వరుసగా సినిమాలు అనౌన్స్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ దశలో రెండు సినిమాలున్నాయి.


వీటిలో వకీల్ సాబ్ ఉంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈమధ్యే షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. అయితే.. ఈ షెడ్యూల్లో పవన్ జాయిన్ కాలేదు. ఆయన లేని సన్నివేశాలు తెరకెక్కించారు. పవన్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చూస్తున్నారు. ఇప్పుడు పవన్ టైమ్ వచ్చిందని ఫిలింనగర్ సర్కిల్స్ లో ఓ వార్త రౌండ్ అవుతోంది. నవంబర్ 1 నుంచి పవన్ కల్యాణ్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. చతుర్మాస దీక్ష కూడా పూర్తి కావడంతో పవన్ షూటింగ్ షురూ చేసారని తెలుస్తోంది.


అయితే.. ప్రస్తుతానికి గాసిప్ గా ఉన్న ఈ వార్తపై అఫిషియల్ న్యూస్ రివీల్ కావాల్సి ఉంది. ఇదే నిజమైతే ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే పూర్తి కానుంది. సినిమాలో పవన్ హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో నివేధా ధామస్, అంజలి నటిస్తున్నారు. పవన్ జాయిన్ అయ్యే షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: