ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక సాదా సీదా షో గా  ప్రారంభమైన జబర్దస్త్ ఆ తర్వాత బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ టాప్ రేటింగ్ ఉన్న షో గా  దూసుకుపోయిన విషయం తెలిసిందే. జబర్దస్త్ వస్తుందంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు అందరూ టీవీలకు అతుక్కుపోయి మరి కామెడీ స్క్రిప్ట్ ను వీక్షిస్తూ కడుపుబ్బా నవ్వుకుంటూ ఉంటారు. అయితే బుల్లితెర ప్రేక్షకులందరికీ మరింత కామెడీని పంచేందుకు జబర్దస్త్ తో పాటు ఎక్స్ ట్రా  జబర్దస్త్ షో కూడా ప్రారంభించారు నిర్వాహకులు. ఇక ఎక్స్ ట్రా  జబర్దస్త్ లో ప్రతీ వారం కూడా సరికొత్త సీట్లతో కమెడియన్లు కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు.




 ఈ క్రమంలోనే ఇటీవల ఈ వారం ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో విడుదలై  బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.  ఈ క్రమంలో ప్రోమోలో భాగంగా  అందరూ డిఫరెంట్ స్కిట్స్ తో ఈవారం జబర్దస్త్ లో అలరించబోతున్నారు అని అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఓ  స్కిట్ లో భాగంగా జడ్జిగా ఉన్న రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. ప్రోమోలో భాగంగా స్కిట్ సాగిపోతుండగా... ఇద్దరూ అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తలను చూసి... చూడవే భార్య భర్తల అంటే  ఇంత  అన్యోన్యంగా ఉండాలి అంటుండగానే లోపలి  నుంచి ఆ వ్యక్తి చిరిగిన బట్టలతో బయటకు వస్తాడు.




 దీంతో ఏంటి భయ్యా మళ్ళీ నీ పెళ్ళాం కొట్టిందా అని అడగగానే... జాంకాయ అన్న తర్వాత చిలక కొట్టుద్ది... పొలం అన్న తర్వాత ఎలుక కొట్టుద్ది... మొగుడు అన్న తర్వాత పెళ్ళాం కొట్టుద్ది  అని డైలాగ్ చెబుతున్న సమయంలో వెంటనే అందుకున్న రోజా కి డైలాగ్ పూర్తి చేస్తుంది. ఇక ఆ తర్వాత ఈ డైలాగ్ మా ఆయన విన్నాడు  అంటే నన్ను కొడతాడు అంటూ నవ్వేస్తుంది రోజా. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో లో భాగంగా ప్రతి ఒక్కరూ అద్భుతమైన స్కిట్స్ తో ఈ వారం బుల్లితెర ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ పంచడంతోపాటు కడుపుబ్బా నవ్వించ పోతున్నారు అనేది మాత్రం అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: