దక్షిణ భారత సినిమా రంగంలో అత్యంత భారీ సినిమాలకు చిరునామా శంకర్. ‘భారతీయుడు’ నుండి ‘రోబో’ వరకు శంకర్ ప్రతిష్ట అతడు తీసిన ప్రతి సినిమాతో పెరుగుతూనే ఉంది. అయితే కొన్ని సంవత్సరాలుగా శంకర్ కీర్తి మసగాబారుతోంది. ‘2.0’ కు ఊహిచిన స్థాయిలో విజయం రాకపోవడంతో శంకర్ డిఫెన్స్ లో పడ్డాడు.


తన ఆలోచనలకు మరింత పదును పెట్టి ప్రస్తుతం కమలహాసన్ తో ‘ఇండియన్ 2’ మూవీని తీస్తున్నా ఆమూవీకి ఎన్నో సమస్యలు ఎదురౌతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో శంకర్ తిరిగి తన సత్తా చాటడానికి మెగా కాంపౌండ్ సహకారం లభిస్తున్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి.


గ్రాఫిక్స్ మాయాజాలం లేకుండా శంకర్ క్రియేట్ చేసిన ఒక పవర్ ఫుల్ స్టోరీకి రామ్ చరణ్ ఓకె చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కథలో హీరోతో సరిసమానంగా ఉండే ఒక ప్రత్యేక పాత్రలో పవన్ కళ్యాణ్ ను నటింప చేయడానికి చరణ్ తన సహకారాన్ని కూడ శంకర్ కు అందిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న ‘ఆచార్య’ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీల షూటింగ్ పూర్తి అవ్వగానే ఈ ఏడాది చివరిలో ఈమూవీ షూటింగ్ ప్రారంభం అయి వచ్చే ఏడాదిలో విడుదల అయ్యే విధంగా ఈమూవీకి శంకర్ పక్కా ప్లాన్ వేసాడు అని అంటున్నారు.


ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ లు ఒక స్క్రీన్ పై కనిపిస్తే చూడాలని మెగా అభిమానులు ఆశ పడుతున్నారు. వారి కోర్కెను తీర్చే విధంగా ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. తెలుస్తున్న సమాచారంమేరకు ఒక ప్రముఖ నిర్మాత సంస్థ సహకారంతో పవన్ సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ ఆర్ట్స్ బ్యానర్ సమర్పణలో ఈమూవీ నిర్మాణం జరుపుకుంటుందని టాక్. శంకర్ స్థానాన్ని ‘బాహుబలి’ తో రాజమౌళి ఆక్రమించాడు. ఇప్పుడు తాను కోల్పోయిన ఆ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి శంకర్ కు పరోక్షంగా మెగా కాంపౌండ్ సహకరిస్తుంది అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: