ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ఎక్కువగా ఫేమస్ అయిన జోడి ఏది అంటే అందరూ టక్కున చెప్పే పేరు ఇమ్మానియేల్ వర్ష  అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బుల్లితెరపై ఏ ఈవెంట్ లో  చూసినా కూడా ఇద్దరే  సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోతున్నారు. జబర్దస్త్ అనే కార్యక్రమంలో కమెడియన్స్ గా ప్రతివారం బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఇద్దరు.. జబర్దస్త్ లో బ్లాక్ అండ్ వైట్ జోడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నారు అన్న విషయం తెలిసిందే.  ఇక ప్రస్తుతం ప్రతి వారం కూడా జబర్దస్త్ లో వీరిద్దరి కాంబినేషన్ లో అదిరిపోయే డైలాగ్స్ తో అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు.



 అంతే కాదు ఈ టీవీ లో ప్రసారమయ్యే స్పెషల్ ఈవెంట్ లో ఎక్కడ  చూసిన కూడా... వర్ష ఇమాన్యుల్ జంటగా కనిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే అయితే వీరి మధ్య ప్రేమ ఉంది అని ప్రచారం ప్రస్తుతం జరుగుతోంది ఒక ఇక వీరి జంట కూడా బుల్లితెర ప్రేక్షకులను ఎప్పుడు ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే జబర్దస్త్లో స్కిట్  చేస్తున్న సమయంలో కూడా వీరిద్దరూ కామెడీ చేస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది . కాగా ఇటీవలే వచ్చేవారం కు సంబంధించి విడుదలైన జబర్దస్త్ ప్రోమో సోషల్  మీడియాలో వైరల్ గా మారింది.




 సాధారణంగా కెవ్వు  కార్తీక్ టీమ్ లో కామెడీ చేస్తూ ఉంటారు వర్ష ఇమాన్యుల్. ఇటీవలె జబర్దస్త్ లో   వర్ష ఏకంగా ఇమ్మానుయేల్ ను  జుట్టు పట్టుకొని కింద పడేసి మరి కొట్టింది. ఎందుకు అంటారా స్కిట్ లో భాగంగా.  ఇటీవలే ప్రోమో లో భాగంగా స్కిట్ లో ...  ఇమాన్యుల్ ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చునే  భర్త లాగా.. వర్ష రోజు ఆఫీస్ కి వెళ్లి వచ్చే  భార్య లాగా చేస్తుంది ఈ క్రమంలోనే ఆఫీస్ కి ఎందుకు తొందరగా వెళ్తున్నావ్ అంటూ స్కిట్ లో భాగంగా ఇమ్మానియేల్ అనుమానించడం తో ఏంట్రా అంటూ జుట్టు పట్టుకుని వెనక్కి లాగటంతో  ఇమ్మానియేల్ కింద పడిపోతాడు.. దీంతో చెడ మడ  వాయిస్తుంది వర్ష.

మరింత సమాచారం తెలుసుకోండి: