ఈ శివరాత్రి రోజున అనగా మార్చి 11న శర్వానంద్ హీరోగా నటించిన "శ్రీకారం" సినిమా రిలీజ్ అవుతోంది. అలాగే నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ "జాతి రత్నాలు" కూడా అదే రోజున విడుదలువుతోంది. మెంటల్ మదిలో ఫేమ్ శ్రీ విష్ణు, నట కిరీటి రాజేంద్రప్రసాద్ నటించిన "గాలి సంపత్" మూవీ కూడా శివ రాత్రి రోజునే రిలీజ్ అవుతుండటం విశేషం.


ఐతే ఈ మూడు సినిమాల్లో 1 కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే.. శివ రాత్రి రోజున విడులవుతున్న శ్రీకారం, జాతి రత్నాలు, గాలి సంపత్ సినిమాల్లో అన్ని U సర్టిఫికెట్స్ పొందాయి. నిజానికి ఇటీవల కాలంలో వస్తున్న అన్ని సినిమాలు కూడా U/A సర్టిఫికెట్స్ మాత్రమే పొందుతున్నాయి. అడల్ట్ సీన్స్ లేకుండా ఒక్క సినిమా కూడా రావడం లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటిది మూడు సినిమాలు మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అది కూడా శివ రాత్రి పర్వదినాన రిలీజ్ కావడం గమనార్హం. మార్చి 11న వస్తున్న ఈ 3 సినిమాలను ప్రేక్షకులు తమ సకుటుంబ సపరివారి సమేతంగా చూడొచ్చు.


ఇకపోతే కిషోర్ రెడ్డి డైరెక్ట్ చేసిన శ్రీకారం సినిమా పై ఓ మాదిరి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా దర్శకనిర్మాతలు, నటీనటులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అనుదీప్ కె.వి డైరెక్ట్ చేసిన జాతి రత్నాలు సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్నష్ కృష్ణ డైరెక్ట్ చేసిన కామెడీ చిత్రం గాలి సంపత్ పై కూడా భారీ స్థాయిలో  అంచనాలు నెలకొన్నాయి. ఐతే శివరాత్రి రోజున ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గా వస్తున్న ఈ 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలని ఆశిద్దాం. అయితే ఈ నెలలో చావు కబురు చల్లగా, మోసగాళ్లు, రంగ్ దే వంటి మరిన్ని మూవీస్ విడుదలకానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: