ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తన అక్క మంచు లక్ష్మి తమ్ముడు మనోజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.విష్ణు మాట్లాడుతూ..అక్క లక్ష్మి తమ్ముడు మనోజ్ లు ఇద్దరు కూడా చాలా చిల్ పర్సన్స్. కాని నేను అలా కాదు. వారిద్దరికి పూర్తి విభిన్నంగా నేను ఉంటాను. వారు లేట్ నైట్ పార్టీలను ఎంజాయ్ చేస్తారు. కాని నేను మాత్రం రాత్రి పొద్దు పోకముందే పడుకుని తెల్లవారు జామున లేస్తాను. నాకు బుక్స్ చదవడం అంటే ఇష్టం వారికి పార్టీలంటే ఇష్టం. నాకు పిల్లలతో ఆడుకోవడం ఇష్టం వారి ప్రపంచం వేరుగా ఉంటుంది. నాకు సాంప్రదాయాలు అంటే గౌరవం. నా పద్దతులు నాకు ఉన్నాయి అన్నాడు.ఇక మనోజ్ విడాకుల గురించి స్పందిస్తూ..
వాడి పర్సనల్ లైఫ్ అలా అవుతుందని అనుకోలేదు. జీవితంలో అన్ని అనుకున్నట్లుగా జరుగవు. కొన్ని సార్లు అనుకున్నట్లుగా కాకుండా వేరేలా జరుగుతుంటాయి. అంతా బాగా అవుతాయని భావిస్తాం. కాని అలా కొన్ని సార్లు జరుగవు. వాటిని మర్చి పోయి ముందుకు వెళ్లి పోవడం తప్ప ఏం చేయలేం అన్నాడు. ఇక తమ్ముడికి అవసరం ఉన్నంత వరకు సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటానని విష్ణు అన్నాడు...ఇదిలా ఉంటె మంచు మనోజ్ త్వరలోనే రెండవ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.. అయితే దీనిపై విష్ణు కానీ మంచు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇప్పటివరకు స్పందించపోవడం గమనార్హం...!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి