ప్రస్తుతం థియేటర్లలో హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది జాతిరత్నాలు సినిమా.. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూ.ఎస్.లో కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో రన్ అవుతోంది..  అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు.. స్వప్న సినిమా బ్యానర్ పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.. ఇక విడుదలకు ముందు చేసిన ప్రమోషన్స్ తో మొదటి రోజే మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టగా, ఆ తర్వాత వచ్చిన  టాక్‌తో వరుసగా అదే జోష్ కంటిన్యూ అవుతోంది.

ఐదో రోజు కూడా ఈ జాతిరత్నాల స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద నవ్వులు పూయిస్తున్నఈ మూవీ వసూళ్ల పరంగానూ ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది. ఈ మూవీ తో పాపులర్ అయిన నవీన్ పొలిశెట్టితో సినిమాలు చేయాలని బడా ప్రొడక్షన్ కంపనీలు ప్లాన్ చేస్తున్నాయి.త్వరలో యువీ క్రియేషన్స్ అనుష్క ప్రధాన పాత్రలో నిర్మించబోతున్న చిత్రంలో నవీన్ పొలిశెట్టి నటించబోతున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఛేంజెస్ ప్రస్తుతం జరుగుతున్నాయి. దీనితో పాటు దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో ఓ సినిమా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఓ సినిమా చేయబోతున్నారట.

ఇదిలా వుంటే ఈ మూవీలతో పాటు నవీన్ పొలిశెట్టికి మరో బంపర్ ఆఫర్ లభించినట్టు తెలిసింది.అది కూడా సూపర్‌స్టార్ మహేష్ నుంచి అని తెలిసింది. మహేష్ ప్రస్తుతం అడివి శేష్ హీరోగా సోనీ పిక్చర్స్‌తో కలిసి `మేజర్‌` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ చివరి దశకు చేరుకుంది. ఇదే బ్యానర్‌పై నవీన్ పొలిశెట్టితో ఓ మూవీ చేయాలని మహేష్ ప్లాన్ చేస్తున్నారట. దీంతో నవీన్ పొలిశెట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది...దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే వెల్లడి కానున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: