పవర్ స్టార్ పవన్ ఒక క్లియర్ హిట్ ని అందుకోని దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. అప్పుడెప్పుడో 2013 లో 'అత్తారింటికి దారేది' సినిమాతో లాస్ట్ హిట్ ని అందుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇక అప్పటి నుంచి ఇప్పటికి దాకా హిట్ అందుకోలేదు. ఇక దాదాపు మూడు సంవత్సరాల తరువాత 'వకీల్ సాబ్' సినిమాతోటి రీ ఎంట్రీ ఇచ్చాడు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని వేణు శ్రీ రామ్ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాకి మంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి భారీ ఓపెనింగ్స్ నే నమోదు చేసింది. కాని ఇప్పుడు కరోనా ఉధృతి వల్ల తేలిపోయింది.వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ ప్రయాణం ముగిసినట్టే కనిపిస్తున్నది.నైజాంలో థియేటర్లను మూసివేయడం, కర్ఫ్యూ పెట్టడం లాంటి అంశాలు సినిమాపై భారీగా ప్రభావం చూపించినట్టు కనిపిస్తున్నది. ఇక ఏపీలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో ఉండటం కూడా వకీల్ సాబ్ వసూళ్ల క్షీణతకు కారణమైందనే చెప్పాలి.


ప్రపంచవ్యాప్తంగా వకీల్ సాబ్ కలెక్షన్లను చూస్తే.. ఏపీ, నైజాంలో రూ.77.23 కోట్ల షేర్ , 120 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.3.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.3.75 కోట్లు వసూలు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.84 కోట్లకుపైగా షేర్ వసూళ్లను, రూ.135 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొన్నది.కాని ఈ సినిమా హిట్ అవ్వాలంటే మినిమం 92 కోట్లైనా షేర్ వసూలు చెయ్యాలి. ఎందుకంటే ఈ సినిమా 91 కోట్లు దాకా థియేట్రికల్ బిజినెస్ చేసింది.కాని 84 కోట్ల వద్దే ఆగిపోవడంతో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న కాని ఒక యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.అయితే ఈ కరోనా ప్రభావం లేకపోయినట్లయితే ఈ సినిమా వసూళ్లు వేరేలా ఉండేవి. మొత్తనికి కరోనా వల్ల ఈ సినిమా యావరేజ్ గా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: