ఒకప్పుడు లవర్ బాయ్ గా, ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి విజయాలు అందుకుంటూ కొన్నాళ్లపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోయాడు జగపతిబాబు.  అప్పట్లో జగపతిబాబు సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉండేవి.  ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం అవకాశాలు రాకపోవడంతో తెలుగు తెరపై పూర్తిగా కనుమరుగై పోయాడు.  కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరమయ్యారు.



 కానీ ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు జగపతిబాబు. ఒకప్పుడు లవర్ బాయ్ గా, ఫ్యామిలీ హీరోగా ఎంతో క్యూట్గా కనిపించిన జగపతిబాబు.. ఏకంగా విలన్ పాత్రలో నటించి అందరినీ అవాక్కయ్యేలా చేసాడు.  ఇక ఆ తర్వాత విలన్ పాత్రలను జగపతి బాబు తప్ప ఇంకెవరు సూట్ కారేమో అనేంతలా తన నటనతో ప్రభావితం చేశాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ విలన్ గా కొనసాగుతున్నాడు జగపతిబాబు. హీరోగా కంటే విలన్ గానే జగపతి బాబు ఎక్కువగా సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నాటి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.



 ఇక ప్రస్తుతం విలన్ గా వరుస అవకాశాలు అందుకుంటూ తనదైన విలనిజంతో ప్రేక్షకులను మెప్పిస్తు.. విలక్షణ నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న జగపతి బాబు.. మరోసారి హీరోగా మారబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఇటీవలే వక్కంతం వంశీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన స్టోరీ నీ జగపతి బాబు కి వినిపించాడట. అయితే స్టోరీ బాగా నచ్చడం..  కథలో తన పాత్ర ఎంతో కొత్తగా ఉండటంతో జగపతిబాబు ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడట. ఇక ఇప్పటి వరకూ కనిపించని కొత్త గెటప్ లో ఈ సినిమాలో జగపతి బాబు కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.  ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా అలరించిన జగపతి బాబు మరోసారి హీరోగా మారి పోతూ ఉండడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: