తాగుడు అనేది ప్రతి మనిషి జీవితాన్ని ఎంతలా నాశనం చేస్తుందో గతంలో చాలా సందర్భాల్లో మనం చూశాం. మద్యానికి బానిస అవడం అనేది నార్మల్ వ్యక్తులకే కాదు సెలబ్రిటీలకు సైతం పీడిస్తున్న ఒక అలవాటు. అయితే దీని నుంచి ఎంత త్వరగా కోలుకొని తన జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తారో వారే లైఫ్ లో
సక్సెస్ అవుతారు. ఆ విధంగా మన సెలెబటీలు చాలామంది మద్యానికి బానిసై ఆ తర్వాత దానివల్ల నష్టం తెలుసుకొని మళ్ళీ మామూలు మనుషులుగా మారారు. అలా మందు మానేసిన సెలబ్రిటీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి వల్లనో లేక
పార్టీ కల్చర్ కు అలవాటు పడిపోవడం వలనో తెలియదు కానీ
సినిమా ఇండస్ట్రీలో మద్యానికి బానిసైన వారిని లిస్ట్ చాలా పెద్దదే అని చాలా కథనాలు రాసుకొచ్చారు విశ్లేషకులు. కొంతమంది ఈ అలవాటు నుండి త్వరగా బయటపడిన్నట్లు కూడా వారు పేర్కొన్నారు. కొంతమంది బహిరంగంగానే ఈ విషయాన్ని వెల్లడించారు. ఉదాహరణకు కమలహాసన్ కూతురు
టాలీవుడ్ స్టార్
హీరోయిన్ శృతిహాసన్ గతంలో మద్యానికి బానిస ఆయిపోయినట్లు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. అయితే ఆరోగ్యం జీవితం రెండు పాడవుతాయి త్వరగానే గ్రహించి వాటిని దూరం పెట్ట
మంది సినిమాల్లో బిజీ అయిపోయింది.
కోలీవుడ్ స్టార్
హీరో శింబు కూడా ఈ బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది.ఈ స్టార్
హీరో కూడా గతంలో మద్యం సేవించనీదే నిద్రపోయేవాడు కాదట. అయితే ఈ ఏడాది నుంచి మందుకు దూరమైనట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు హెల్త్ ఫిట్నెస్ పై దృష్టి పెట్టినట్లు తెలిపారు. గతంలో శింబు చాలా లావైన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు అతను బాగా స్లిమ్ గా తయారయ్యాడు. గత ఏడాది లాక్ డౌన్ సమయం నుంచి మందు మానేసినట్లు చెప్పాడు. వీరే కాకుండా మద్యం మానేసిన స్టార్ ల లిస్టులో అనుపమ పరమేశ్వరన్ కూడా ఉంది. ఆమె గతంలో
లవ్ ఫెయిల్యూర్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్లి మద్యానికి బానిసై మళ్లీ కోలుకున్నారట.