సినిమాల మీద ఇంట్రెస్ట్ తో రైటర్ చిన్నికృష్ణని కలిస్తే ఆయన గంగోత్రిలో ఒక సీన్ ఇచ్చి రెండు రోజుల్లో రాసుకుని రా అని చెబితే వెంటనే రాసి ఇచ్చారట బాబీ. అక్కడ తన పనితనం నచ్చి చిన్నికృష్ణ దగ్గర ఆ తర్వాత మరో ఇద్దరి దర్శకుల దగ్గర పనిచేశారట. ఇక రవితేజ బలుపు సినిమాకు పనిచేసిన బాబీ ఈ సినిమా హిట్ అయితే నీకు ఛాన్స్ ఇస్తానని అన్నారట. అలానే బలుపు హిట్ అవడంతోనే బాబీ డైరక్షన్ లో పవర్ సినిమా చేశారు మాస్ రాజా. ఆ సినిమాతో దర్శకుడిగా మొదటి హిట్ అందుకున్నాడు కె.ఎస్ రవీంద్ర. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ పోయినా ఎన్.టి.ఆర్ తో తీసిన జై లవ కుశ మళ్లీ అతన్ని ఫాం లోకి వచ్చేలా చేసింది.
విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన వెంకీమామతో కూడా హిట్ అందుకున్న బాబీ తన నెక్స్ట్ సినిమా మెగాస్టార్ చిరంజీఎవితో చేస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మరోసారి గ్యాంగ్ లీడ్ర్ లుక్ తో కనిపిస్తారని అంటున్నారు. ఈ సినిమాతో బాబీ తన పెన్ పవర్ ఏంటన్నది మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. మెగాస్టార్ ను మెప్పించే స్క్రిప్ట్ ఇచ్చాడు అంటే అక్కడే బాబీ సగం సక్సెస్ అయినట్టు లెక్క.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి