కరోనా తీవ్రంగా ప్రభావం చూపిస్తున్న సమయంలో ప్రభుత్వం సినిమా థియేటర్స్ మూసివేసింది. కరోనా  సెకండ్ వేవ్ కారణంగా మూసివేసిన థియేటర్స్ సుమారు రెండు నెలల కాలం తరువాత ప్రభుత్వం 50 శాతం అక్క్యూ పెన్సీ తో థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది.అయిన థియేటర్స్ ఓపెన్ చేయడానికి ఎవరు సాహసించడంలేదు. తిరిగి అక్టోబర్ లో తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.చిన్న చిన్న సినిమాలు అన్ని OTT లలో విడుదల అవుతున్నాయి. చాలా సినిమాలు వాటి విడుదల వాయిదా వేసుకున్నాయి. థియేటర్స్ ఓపెన్ చేయగానే సందడి చేయడానికి సంవత్సరాలనుండి తీస్తున్న పెద్ద సినిమాలు చాలానే వున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా RRR.
రాజమౌళి రెండున్నర సంవత్సరాలగా తీస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు అయిన  రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరంభీమ్ గా కనిపించబోతున్నారు. సుమారు 400కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. అక్టోబర్ లో థియేటర్స్ పూర్తిగా తెరుచుకోనుండగా అక్టోబర్ 13న ఈ సినిమానువ్వు విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఇద్దరి హీరోల ఫస్టులుక్స్ ఈ సినిమాపై భారీ  అంచనాలు నెలకొల్పాయి. ఇదిలా ఉండగా ఇటీవల రాజమౌళి rrr మేకింగ్ వీడియో విడుదల చేసాడు. ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుందో మేకింగ్ వీడియోలో చూపించాడు. ఆగస్టు నుంచి rrr సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేయాలనీ రాజమౌళి  చూస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం  ఒక ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఒక భారీ ఫైట్ ఉండబోతున్నట్లు సమాచారం అందింది. ఒక  అడవిలో 300 మంది గిరిజనులకి పోలీసులకు జరిగే దాడిలో ఎన్టీఆరనువ్వు రాంచరణ్ అరెస్ట్ చేస్తాడట. ఈ సీన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: