సమంత అక్కినేని.. ఎప్పటికప్పుడు మోస్ట్ బిజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. పెళ్లికి ముందు పెళ్లికి తరువాత కూడా సినిమాలలోనూ, ప్రకటనల్లోనూ, వెబ్ సిరీస్ లోనూ ,పలు షోలను నిర్వహిస్తూ బిజీగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే అక్కినేని వారి కుటుంబంలో ఎక్కువగా కష్టపడుతోంది అని చెప్పవచ్చు. కేవలం ఈమె సంపాదించిన ఆస్తి మాత్రమే 250 కోట్ల పైనే  ఉంది.అంటే ఆమె ఎంత  కష్టపడుతుందో చెప్పవచ్చు. సమంత ఇటీవల ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ లో నటించి విమర్శల పాలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సరికొత్తగా లేడీ ఓరియెంటెడ్ చిత్రం ద్వారా మన ముందుకు వస్తోంది.

అది ఏదో కాదు.. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శాకుంతలం. ఇందులో సమంత లేడి ఓరియెంటెడ్ గా దుస్సల పాత్రలో నటిస్తోంది.ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో భరతుని పాత్రలో అల్లు అర్హ నటిస్తోంది. గెస్ట్ అప్పియరెన్స్ గా నటిస్తూన్న ఈ పాప కన్నుల విందుగా నటిస్తోంది. అని సమంత కూడా ప్రశంసల వర్షం కురిపించింది. అంతేకాదు సెట్లో అల్లు అర్హకు సంబంధించిన అన్ని విషయాలను సమంత దగ్గరుండి చూసుకోవడంతో సమంతకు.. స్నేహ రెడ్డి అలాగే అల్లు అర్జున్ ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలిపారు.ఇకపోతే ప్రస్తుతం శాకుంతలం సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజు అనగా జూలై 24 తేదీన షూటింగ్ కి సమంత ఒక తోడును తీసుకు వచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచింది. అది ఏదో కాదు తన పెంపుడు కుక్క. ఇక వారి కుక్క హోస్ అక్కినేని సమంత ఒళ్లో కూర్చుని, తన ముఖాన్ని పట్టుకుంటున్న ఒక ఫోటో ని సమంత షేర్ చేసింది. అంతే కాదు ఈ రోజు నా బిడ్డను పనికి తీసుకు వెళ్తున్నాను అని కూడా సమంత ఫోటో కింద క్యాప్షన్ గా ఇచ్చింది. ఇది జ్యోతి చూసిన అందరూ ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: