రాజకుమారుడు సినిమాతో హీరో గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను చేసి ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పటివరకు ఎన్నో గొప్ప గొప్ప చిత్రాల్లో నటించి నటుడిగా సత్తా చాటిన మహేష్ బాబు ఆయన కెరీర్లో విభిన్నమైన చిత్రంగా కృష్ణ వంశీ దర్శకత్వంలో చేసిన మురారి సినిమా ఎప్పటికీ నిలిచిపోతుంది. రాం ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై గోపి, రామలింగేశ్వరరావు ఎన్ దేవీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఈ సినిమా ద్వారానే హీరోయిన్ సోనాలి బింద్రే పరిచయమయ్యింది.

భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో అప్పట్లో కృష్ణవంశీ ఈ సినిమాను తెరకెక్కించి కుటుంబ కథా చిత్రంగా మలిచాడు. ఉసురు తగలడం వల్ల ఒక వ్యక్తి వంశం ఎలా దెబ్బతిన్నదనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. 19వ శతాబ్దంలో ఓ జమిందారు చేసిన తప్పుకు ప్రతి నెల 48 సంవత్సరాలకు ఒకసారి అతని వంశస్తులలో ఒకరినీ ఆ వూరి దేవత బలి తీసుకుంటున్న తరుణంలో ఈ సారి మరణించబోయే వ్యక్తి ఆ అమ్మవారిని ఎలా శాంత పరిచాడు. ఎలా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు అనేదే ఈ సినిమాకి మూల కథ. 

మహేష్ బాబు స్టోరీ ఎంపిక బాగా ఉంటుందని ఈ సినిమా ఎంపిక స్పష్టమైన నిదర్శనమని చెప్పవచ్చు. అయితే సినిమా స్పురించడానికి కారణం ఏమిటనే విషయం కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కథాపరంగా మహేష్ బాబు ముత్తాత, తాత, తండ్రి మరణాలకు కారణం ఒక శాపం. ఆ శాపగ్రస్త కుటుంబ కథా కృష్ణవంశీ మదిలో మేదలదానికి కారణం ఇందిరాగాంధీ కుటుంబం అని చెప్పాడు. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ని ఎవరో కాల్చిచంపారు. అలాగే ఇందిరా గాంధీ మరణం తర్వాత సంజీవ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించటం. రాజీవ్ గాంధీ హత్య గావించబడడం. ఇవన్నీ చూస్తే కృష్ణవంశీకి ఇదేమన్నా శాపగ్రస్త కుటుంబమా అని అనిపించి వెంటనే ఒక కథను రూపుదిద్దాడు అదే మురారి. 

మరింత సమాచారం తెలుసుకోండి: