కోలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన సూర్య కి తమిళంతో పాటూ తెలుగులో కూడా భారీ పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే.గత ఏడాది ఈ హీరో నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది.ఈ సినిమాలో సూర్య నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు సూర్య.ఇక ఇదిలా ఉంటె సూర్య సినిమాల్లోకి రాకముందు ఒక బట్టల దుకాణంలో పని చేసేవాడట.నటనపై పెద్దగా ఆసక్తి లేని సూర్య సినిమాల్లోకి రావాలని భావించలేదట.చదువు పూర్తయిన తర్వాత ఒక దుస్తుల ఎగుమతుల సంస్థ లో పని చేసారు సూర్య.

ఆ సంస్థ లో రోజుకు 18 గంటలపాటు పనిచేసేవాడట సూర్య.అయితే అంత కష్టపడినా సూర్యకు నెలకు కేవలం 736 రూపాయలు మాత్రమే జీతంగా ఇచ్చేవారట.కష్టం ఎక్కువ కావడంతో పాటూ వేతనం సరిపోకపోవడం వల్ల సూర్య నటుడిగా మారాలని అనుకున్నారు.ప్రముఖ నటుడు శివ కుమార్ కొడుకు కావడంతో సూర్యకు సినిమాల్లో సులభంగానే అవకాశాలు వచ్చాయి.మెయిన్ హీరో రోల్స్ రాకపోవడంతో సూర్య కొన్ని సినిమాలలో సెకండ్ హీరో పాత్రల్లో సైతం నటించాడు.ఇక ఆ తర్వాత మెయిన్ హీరోగా నటించిన సినిమాలు హిట్ కావడంతో సూర్యకు క్రేజ్ తో పాటు అనూహ్యంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

లైఫ్ లో ఎంతో కష్టపడిన తర్వాత సక్సెస్ ఫుల్ హీరోగా ఎదగడంతో పాటు వరుస సినిమా అవకాశాలతో బిజీ అయ్యారు.ఇక ప్రస్తుతం సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు సూర్య.ఇక ఒక్కో సినిమాకు సుమారు 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నాడు ఈ కోలీవుడ్ హీరో.ఇక ప్రస్తుతం సూర్య తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో "వాడివాసల్" అనే సినిమా చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇక ఈ సినిమాతో పాటూ తెలుగులో ఒక స్ట్రెయిట్ మూవీ కూడా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు సూర్య.ఈఈ మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తెలుగులో ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: