టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు వ‌స్తుందా ? ఆయ‌న అభిమానులు క‌ళ్ల‌ల్లో వ‌త్తులు వేసుకుని మ‌రీ వెయిట్ చేస్తున్నారు. 2018లో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ న‌టించిన సినిమా ఏదీ థియేట‌ర్ల లోకి రాలేదు. అర‌వింద స‌మేత త‌ర్వాత ఎన్టీఆర్ పూర్తి గా ఆర్ ఆర్ ఆర్ కే లాక్ అయిపోయాడు. ఆర్ ఆర్ ఆర్ కూడా రెండున్న రేళ్లుగా షూటింగ్ జ‌రుపు కుంటూ అస‌లు ఎప్పుడు థియేట‌ర్ల లోకి వ‌స్తుందో ?  కూడా అర్థంకాని ప‌రిస్థితి.

మ‌ధ్య‌లో ఆర్ ఆర్ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయాల‌ని ఎన్టీఆర్ అనుకున్నారు. అయితే ఆర్ ఆర్ మ‌రీ లేట్ అవుతుండ‌డంతో త్రివిక్ర‌మ్ మ‌హేష్‌కు ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత కొర‌టా ల‌కు క‌మిట్ అయిన సంగ‌తి తెలిసిందే. కొర‌టాల ప్ర‌స్తుతం మెగా స్టార్ చిరంజీవి హీరో గా రామ్ చ‌ర‌ణ్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో ఆచార్య సినిమా తెర‌కెక్కి స్తున్నారు.

అయితే ఎన్టీఆర్ - కొర‌టాల సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే జూబ్లి హిల్స్ లో ఎన్టీఆర్ ఇంటికి ద‌గ్గ‌ర్లోనే ఓ సెట్ వేశార‌ట‌. సినిమా లో మేజ‌ర్ పార్ట్ అంతా ఈ సెట్ లోనే షూటింగ్ జ‌రుగుతుంద‌ట‌. ఇప్ప‌టికే కొర‌టాల శివ ఈ సినిమాకు సంబంధించి క‌థ‌ను అంతా ఫినిష్ చేశాడ‌ట‌.

ఎన్టీఆర్ చెప్పిన మార్పులు కూడా ఓకే చేశాడ‌ని.. ఇప్పుడు కొర‌టాల కంప్లీట్ గా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడ‌ని టాక్ ?  ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ క్రేజీ ప్రాజెక్టు ను నిర్మించనున్నాయి. గతంలో ఎన్టీఆర్కొరటాల కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: