సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్ లు ఉన్న.. కొత్త అందాలు తెర పైకి వస్తున్నా కూడా..కొందరు మాత్రం పాత హీరోయిన్ అందాలని చూడటానికి ఇష్టపడతారు. అలాంటి వారిలో ఈ మెహ్రీన్ కూడా ఒకరు. అప్పుడెప్పుడో నేచురల్ స్టార్ నాని నటించిన "కృష్ణగాడి వీరప్రేమ గాధ" అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ బొద్దుగుమ్మ..ఫస్ట్ సినిమాతోనే అందరి కళ్లు తనపై పడేలా చేసుకుంది. క్యూట్ స్మైల్ తో..చిలిపి కోపంతో నాని ని ప్రేమించే అమ్మాయిగా అదరకొట్టేసింది. నిజానికి మొదట్లో ఈ అమ్మడు చాలా బొద్దుగా ఉండేది. జనరల్ గా హీరోయిన్ అంటే సన్నగా నాజూకుగా ఉండాలి అప్పుడే అభిమానులు ఇష్టపడతారు అనే వాళ్లకి ఈ అమ్మడు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన్నట్లైంది.

ఇక "కృష్ణగాడి వీరప్రేమ గాధ" సినిమా సక్సెస్ తో అమ్మడుకి అవకాశాలు క్యూ కట్టాయి. యంగ్ హీరోలే కాదు ..సీనియర్ హీరోలతో నటించే ఛాన్స్ లు కూడా అందుకుంది ఈ బ్యూటీ. ముఖ్యంగా అనిల్ రావిపూడి తెరకెక్కిమచిన "ఎఫ్2" అనే సినిమాలో హనీ పాత్రలో తెగ అల్లరి చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో..అమ్మడు రెమ్యూనరేషన్ కూడా పెంచేసి .. టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరింది. అంతేనా సడెన్ షాకిస్తూ గ్రాండ్‌గా భవ్య భిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకుని..పెళ్ళి చేసుకుంటున్న అంటూ  ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేసింది. సీన్ కట్ చేస్తే ..జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నా అంటూ మరో బాంబ్ పెల్చేసింది.  ఇకపై నా దృష్టి అంతా సినీ కెరీర్ వైపే అంటూ..ఢిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ హిట్ ట్రాక్ కొనసాగిస్తుంది.  

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెహ్రీన్ తన ఖాతలో మరో అధ్బుతమైన విజయం అందుకోబోతున్నట్లు  తెలుస్తుంది. నాగార్జునకు జోడీగా ఈమె ను ఫైనల్ చేసారట చిత్ర మేకర్స్. నాగార్జున హీరోగా నటిస్తున్న  ‘ది ఘోస్ట్‌’ సినిమాలో నాగ్ తో రొమాన్స్ చేసే బ్యూటీగా ఈ అమ్మడు నటిస్తుందట. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ యమ హాట్ గా  కనిపించనున్నారంటూ  ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్‌గా  కాజల్‌ అనుకున్నారు మేకర్స్.. కానీ ఆమె వ్యక్తిగత కారణాల చేత ఈ సినిమా నుండి తప్పుకోవడంతో..ఆ ఛాన్స్ మెహ్రీన్ అందుకున్నట్లు తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: