తెలుగు సినీ గేయ రచయిత లో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. అలాంటి ఎంతో మంది ప్రముఖు లలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. ఈయన కె విశ్వనాధ్ దర్శకత్వం లో తెరకెక్కిన సిరివెన్నెల సినిమా తో గేయ రచయిత గా పరిచయం అయ్యాడు. మొదటి సినిమా తోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంతో పేరు ప్రతిష్టలు సాధించాడు. సిరివెన్నెల సినిమా లో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన  విధాత తలపున అనే పాటకు నంది అవార్డు కూడా వచ్చింది. అలా మొదటి సినిమా తోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక గొప్ప గుర్తింపు తెచ్చుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆ తర్వాత కూడా ఎన్నో విజయవంతమైన సినిమాలకు గొప్ప గొప్ప పాటలను రాసి సినిమాలకే గుర్తింపు తీసుకు వచ్చాడు. అలా సిరివెన్నెల సీతారామ రాజు శాస్త్రి రాసిన గొప్ప గొప్ప పాటలలో ఒకటి గమ్యం సినిమాలోని వరకు ఎందు కొరకు ఇంత పరుగు అని అడక్కు అనే ఈ పాట ఈ సినిమా కథను మొత్తం తెలియ జేసే విధంగా ఉంటుంది.

అప్పటి వర కు సాగిన ఈ సినిమా కథ ను ఆ తర్వాత సాగే సినిమా కథ ను కూడా ఒకే పాట లో చాలా అద్భుతం గా సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలిపే విధం గా ఈ పాటను రాశారు. ఈ పాట కు సిరివెన్నెల సీతారామశాస్త్రి కి నంది అవార్డు కూడా దక్కింది. ఈ సినిమా కథ ఒక పెద్ద ధనవంతుడైన అబ్బాయి కి మరియు పేద అమ్మాయి కి  మధ్య ప్రేమ కలిగితే వారి ఇద్దరి ఆలోచ నలు ఏ విధంగా ఉంటాయి. అలాగే వారిద్ద రూ దూరం అయి పోయిన తర్వాత ఆమె కోసం  వెతికే గమ్యం లో హీరో కు ఎదురయ్యే అను భవాలు ఇలా అనేక విషయా లను ఒకే పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలియ జేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: