ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన పుష్పక విమానం సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 10వ తేదీన అహాలో విడుదల కాబోతు ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు హీరో. వెరైటీ కాన్సెప్ట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో నటుడిగా మరొక మెట్టు ఎక్కాడు ఆనంద్ దేవరకొండ. 

ముందు నుంచి ఆయన వెరైటీ కథలు ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పర్చుకున్నాడు. ఆ విధంగా ఆనంద్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు కాగా ఇకపై కూడా తన సినిమాల్లో మంచి కాన్సెప్ట్ వుండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు అని ఆయన ఎంపిక చేసుకుంటున్న సినిమాలను బట్టి తెలుస్తుంది. ఇప్పటివరకు కొత్త దర్శకులతో మాత్రమే పని చేస్తూ వచ్చిన ఆనంద్ దేవరకొండ ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కె.వి.గుహన్ దర్శకత్వంలో హైవే అనే ఓ సినిమా చేస్తున్నాడు.

ఇటీవల ఆయన మెగాఫోన్ పట్టుకుని పలు మంచి చిత్రాలు చేస్తుండగా ఇప్పుడు ఆనంద్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ కి తగిన ఓ కథ ను తయారు చేసి ఆ సినిమా ను ఓకే చేయించుకుని షూటింగ్ పూర్తి చేసుకునేలా చేశాడు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూ ఉండగా ఈ చిత్రం తప్పకుండా దేవరకొండ అభిమానులను అలరించే విధం గా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రాని కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా ఇప్పటి కే మంచి సినిమా లతో దూసుకుపోతుండ గా ఆనంద్ దేవరకొండ మళ్ళీ మరొక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాతో రాబోతున్నాడు అని తెలుస్తుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్లో అలరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: