సిరి, షణ్ముఖ్ మాట్లాడితే ముద్దులు పెట్టుకోవడం.. హగ్గులు ఇచ్చుకోవడం బిగ్ బాస్ ఆడియెన్స్ కు నచ్చలేదు. అందుకే అప్పటి నుండి వీరికి పోటీగా వస్తున్న సన్నీని హీరోగా చేస్తూ వచ్చారు. ఇక షణ్ముఖ్ తో ఫస్ట్ వీక్ నుండి చివరి వరకు అంటి పెట్టుకుని ఉంది సిరి. కేవలం షణ్ముఖ్ కి బయట ఉన్న సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసమే సిరి అలా చేసిందని అందరు అంటున్నారు. ఇదే విషయాన్ని టాప్ 3 కంటెస్టంట్ శ్రీరాం చంద్ర కూడా కన్ ఫర్మ్ చేశారు.
షణ్ముఖ్ తో ఉండకుండా ఉంటే సిరి టాప్ 5 దాకా వచ్చే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాడు శ్రీరాం చంద్ర. షణ్ను వల్లే సిరి ఇన్నాళ్లు హౌజ్ లో ఉన్నదని చెప్పకనే చెప్పాడు. ఈ కారణం వల్లే ఏమో మిగతా హౌజ్ మెట్స్ చిన్న మాట అన్నా సరే ఎగిరి పడే సిరి షణ్ముఖ్ ఎంత తిడుతున్నా.. దూరం పెట్టినా సరే అతనికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. సిరి తన ఆటతో పాటు షణ్ముఖ్ ఆట కూడా పూర్తిగా తినేసిందని అంటున్నారు. ఏది ఏమైనా సిరి, షణ్ముఖ్ లు హౌజ్ లో ఆట ఆడమని పంపిస్తే సీరియస్ ఆ రిలేషన్ లోకి పడేంతగా దగ్గరయ్యారన్నది మాత్రం నిజమని చెప్పొచ్చు. అయితే దీని నుండి వారు ఎలా బయటపడతారు అన్నది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి