
సాక్షి సింగ్ రావత్.. 1988 నవంబర్ 19వ తేదీన అస్సాంలో ఉన్న గౌహతిలో జన్మించింది. ఈమె తండ్రి పేరు ఆర్కే సింగ్. ఈయన కెనాయి గ్రూప్స్ ఆఫ్ బినాగురి టీ కంపెనీలో పని చేస్తున్నారు. ఇక ఈమె తల్లి పేరు షీలా సింగ్. ఇక ఈమె గృహిణి.. సాక్షి తాతగారు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. ఇక ఈమెకు ఒక అన్న అక్షయ్ , చెల్లెలు అభిలాష కూడా ఉన్నారు. గౌహతి లో తన ప్రీ స్కూలు విద్యను పూర్తి చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ క్లాస్మేట్ సాక్షి. ఇక వీరిద్దరు హైస్కూల్లో కలిసి చదువుకున్నారు.
డెహ్రడూన్ లో ఉన్న వెల్హామ్ గర్ల్స్ స్కూల్లో హైస్కూలు విద్యను పూర్తి చేసింది. రాంచీ లో వున్న జవహార్ విద్యా మందిర్ లో తన ఉన్నత విద్య ను పూర్తి చేసింది. హౌరంగబాద్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ పూర్తి చేసింది. ఇక రాంచీలో ధోనీతో కలిసి చదువుకుంది. అంతేకాదు పర్సింగ్ హోటల్ మేనేజ్మెంట్లో ఇంటర్న్ షిప్ కింద 2007లో వీరిద్దరూ కలిసి పని చేయడం గమనార్హం.. ఇక సాక్షికి ధోని జూనియర్ కాబట్టి ఏ ఒక్క రోజు కూడా ఆమె కాలేజ్ లో అతడిని కలవలేదట. సాక్షి అలాగే ధోనీ వాళ్ళ తండ్రి ఇద్దరూ మెకోన్ కంపెనీలో పనిచేసేవారు. అయితే ఒకరోజు ఇంటెర్న్ షిప్ లాస్ట్ రోజు ఫేర్వెల్ డే పార్టీ లో యుదజిత్ దత్త నుంచి ధోని సాక్షి నెంబర్ తీసుకుని ప్రతి రోజు మెసేజ్ చేస్తూ ఉండగా ఆమె తన ఫ్రెండ్స్ ఎవరో మెసేజ్ చేస్తూ ఆటపట్టిస్తున్నారు అని అనుకున్నదట.
కానీ ఆ తర్వాత ధోనీ తనని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న సాక్షి 2008లో మొదటిసారిగా కలుసుకున్నారు. తర్వాత ఇరువురు కుటుంబ పెద్దలను ఒప్పించి, 2010 జూలై 3న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.ఇక 2 రోజుల తర్వాత వివాహం చేసుకున్నారు. ఇకపోతే సాక్షి ధోని కంటే వయసులో ఏడు సంవత్సరాలు పెద్దది. ఇక దివా అనే అమ్మాయి ఫిబ్రవరి 2015లో జన్మించింది.