టాలీవుడ్‌లో అన్న‌ద‌మ్ములైన హీరోలు ఎంద‌రో ఉన్నారు. అయితే కొంద‌రు హీరోలు ఒకే తండ్రికి పుట్టినా.. త‌ల్లులు మాత్రం వేర్వేరు. మ‌రి అటువంటి హీరోలు ఎవ‌రెవ‌రు ఉన్నారో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్: నందమూరి హరికృష్ణ  మొద‌ట లక్ష్మీని పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు జానకీరామ్, కల్యాణ్ రామ్, సుహసినిలు జన్మించారు. ఆ త‌ర్వాత హ‌రికృష్ణ త‌న ఇంటికి సంగీతం పాఠాలు చెప్పేందుకు వ‌చ్చిన షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకోగా.. వీరికి జ్యూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టాడు. అయితే ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌ల‌కు త‌ల్లులు వేరైన‌ప్ప‌టికీ.. సొంత అన్న‌ద‌మ్ముల కంటే అన్యోనంగా ఉంటూ ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచారు.
మంచు విష్ణు - మంచు మనోజ్: టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యులైన మంచు విష్ణు, మంచు మనోజ్‌ల‌కు తండ్రి ఒక్క‌డే అయినా.. త‌ల్లులు మాత్రం వేరు. మోహన్‌బాబు మద్రాస్ లో సినీ కెరీర్ ఆరంభ దశలో ఉండగానే ఆయనకు విద్యాదేవితో పెళ్లయ్యింది. వీరిద్దరికి విష్ణు, లక్ష్మి పుట్టారు. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల విద్యాదేవి ఆత్మహత్య చేసుకోగా.. మోహ‌న్ బాబు త‌న భార్య సోద‌రి నిర్మలను పెళ్లి చేసుకున్నారు. వీరికి అప్పుడు విష్ణు జ‌న్మించాడు.
 నాగ చైతన్య - అఖిల్: అక్కినేని నటవారసుడిగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టి అంచ‌లంచ‌లుగా ఎదిగిన టాలీవుడ్ కింగ్ నాగార్జున మొద‌ట ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు కుమార్తె, విక్ట‌రీ వెంక‌టేష్‌ సోద‌రి ల‌క్ష్మీని పెళ్లి చేసుకున్నారు. వీరికి నాగ చైత‌న్య జ‌న్మించిన త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో.. విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత స‌హ న‌టి అమ‌ల‌ను నాగార్జున ప్రేమించి పెళ్లి చేసుకోగా.. ఈ దంప‌తుల‌కు అఖిల్ పుట్టాడు.
మహేష్ బాబు - న‌రేష్‌: టాలీవుడ్‌లో అన్న‌ద‌మ్ములుగా కొన‌సాగుతున్న మ‌హేష్ బాబు, న‌రేష్‌ల‌కు త‌ల్లుల్లే కాదు తండ్రులు కూడా వేరే. సూప‌ర్ స్టార్‌ కృష్ణ ఇందిరా దేవిని పెళ్లి చేసుకోగా.. మ‌హేష్ బాబు జ‌న్మించాడు. ఇక ఆ త‌ర్వాత కృష్ణ విజయనిర్మలను రెండో వివాహం చేసుకున్నారు. అయితే ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. విజ‌య‌నిర్మాల‌కే అప్ప‌టికే పెళ్లై న‌రేష్ జ‌న్మించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: